NTV Telugu Site icon

CPI Narayana: ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీపీఐ ఉద్యమం చేస్తుంది..

Narayana

Narayana

CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ఏపీ ఆస్తులు తీసుకోమని అప్పట్లో జగన్ తెలంగాణ ప్రభుత్వానికి చెప్పాడు అని గుర్తు చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ స్వాగతిస్తున్నాం.. ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం శుభ పరిణామం.. ఇది రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకొని ధోరణితో ఉండాలి.. ఎందుకు ఐఏఎస్, ఐపీఎస్లు రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తున్నారు అని ప్రశ్నించారు. 22 ఏళ్లకే ఐఏఎస్ అయిన శ్రీ లక్ష్మీ ప్రధాన మంత్రి కార్యాలయంలో పోస్టింగ్ లో ఉండాల్సిన ఆమె జైలు పాలు అయిందన్నారు. రాజకీయ పార్టీలకు ప్రజలిచ్చింది ఐదేళ్ళ సమయమే.. ఐదేళ్లు మిడిసి పడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారం కోల్పోయాడు అని ఆయన మండిపడ్డారు. ఇక, మోడీకి చింత చచ్చినా పులుపు చావలేదు.. ప్రధానికి ఇంకా అహంభావం పోలేదు.. 400 సీట్లు వస్తాయని ప్రగల్భాలు పలికిన మోడీ.. 2019 ఎన్నికల కంటే కూడా తక్కువ సీట్లు వచ్చాయిని సీపీఐ నారాయణ అన్నారు.

Read Also: IND vs PAK: పాకిస్తాన్ చేతిలో భారత్ దారుణ ఓటమి.. సురేష్ రైనా చెలరేగినా..!

ఇక, బ్రిటిష్ వాళ్ళు ప్రవేశ పెట్టిన చట్టాలు అమలు చేస్తూ.. మోడీ ఆ చట్టాల పేర్లు మార్చారు అని సీపీఐ నారాయణ తెలిపారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది.. వీరిద్దరూ ప్లేట్ ఫిరయించకుండా మోడీ పట్టుకున్నాడు.. ప్రమాదకరమైన బీజేపీని చంద్రబాబు రెండోసారి రాష్ట్రానికి రప్పించాడు.. ప్రత్యేక హోదా కోసం సిపిఐ తప్పకుండా ఉద్యమం చేస్తుంది అని ఆయన పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు.

Read Also: Suryapet Principal: ప్రిన్సిపాల్‌ రూమ్‌లో బీరు బాటిళ్ల ఘటన.. మంత్రి ఉత్తమ్‌ సీరియస్‌..

ఇక, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధుల కోసం ఒత్తిడి చేయలేదు అని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి అని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రజలు చంద్రబాబుకు అధికారం అప్పగించారు తప్ప.. బీజేపీ, జనసేన పార్టీల పొత్తు వల్ల కాదు అని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీలో మంచి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను.. సమస్యలన్నీ ఒక్క రోజులో పరిష్కారం అయ్యేవి కావు అని సీపీఐ రామకృష్ణ చెప్పుకొచ్చారు.