Suryapet Principal: ప్రిన్సిపాల్ రూమ్‌లో బీరు బాటిళ్ల ఘటన.. మంత్రి ఉత్తమ్ సీరియస్..
- సూర్యాపేటలోగురుకుల డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ వేధింపులు..
- రెండు రోజుల నుంచి విద్యార్థులు ఆందోళన ..
- ప్రిన్సిపాల్ గదిలో 4 బీరు సీసాలు..
- ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryapet Principal: సూర్యాపేటలోని బాలెంల సాంఘిక సంక్షేమ, బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని విద్యార్థులు రెండు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. శనివారం ప్రిన్సిపాల్ గదిలో 4 బీరు సీసాలు కనిపించడంతో ఆమె గదికి తాళం వేసి నిరసన తెలిపారు. ప్రిన్సిపల్ శైలజ తమతో దురుసుగా ప్రవర్తిస్తోందని, భోజనం సక్రమంగా అందించడం లేదని, ప్రశ్నిస్తే చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు సూర్యాపేట-జనగాం రహదారిపై 4వ తేదీన బైఠాయించగా.. చర్యలు తీసుకుంటామని సాంఘిక సంక్షేమ గురుకులాల ప్రాంతీయ సమన్వయకర్త అరుణకుమారి హామీ ఇచ్చి ఆందోళన విరమించారు.
Read also: Ashada Masam 2024: ఆషాఢ మాసంలో ఈ పనులు చేస్తే అంతా సంతోషమే..!
Also Read
ఇటీవల ప్రిన్సిపల్ శైలజ కేర్ టేకర్ సౌమిత్రితో కలిసి తన ఛాంబర్ లోనే అర్ధరాత్రి వరకు మందు తాగానని, సమస్యలపై ప్రశ్నిస్తే ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ వేణుమాధవరావు, ఆర్‌సీఓ అరుణకుమారి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి జ్యోతి, డీఎస్పీ రవికుమార్, సీఐ రాజశేఖర్, రూరల్ ఎస్సై బాలునాయక్ కళాశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. శైలజను సస్పెండ్ చేయడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ప్రిన్సిపాల్ గదిలో బీరు సీసాలు బయటపడిన ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌ను శనివారం విచారణకు ఆదేశించారు. దీంతో కలెక్టర్ కమిటీ అధికారిణిగా అదనపు కలెక్టర్ లత, జెడ్పీ డిప్యూటీ సీఈవో శిరీష, ఆర్డీఓ వేణుమాధవ్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి లత సభ్యులుగా విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
Ashwaraopet SI: అశ్వారావుపేట ఎస్సై ఘటన విషాదం.. చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి..
తాజావార్తలు
-
OTR: వివాదాస్పదంగా తంబళ్ళపల్లె టీడీపీ ఇన్చార్జి వైఖరి..
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!