Site icon NTV Telugu

CPI Ramakrishna: వరద బాధితుల్ని ఆదుకోవడంలో విఫలం

Cpi Ramakrish

Cpi Ramakrish

ఇటీవల సంభవించిన గోదావరి వరదల్లో అనేకమంది సర్వం కోల్పోయారన్నారు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ. గోదావరి వరదల సమయంలో పోలవరం ముంపు ప్రాంతాల్లో 21 రోజులు కరెంట్ లేదు. ప్రభుత్వం సహాయం చేయటంలో విఫలం అయ్యిందని విమర్శించారు. 22 శాతం మాత్రమే పోలవరం నిర్వాసితులకు పరిహారం అందింది.

Lovers Arrest: ప్రియురాలి కోసం అన్న దొంగతనం.. తర్వాతేమైంది?

వరద బాధితులకు తెలంగాణ 10 వేలు రూపాయలు ఇస్తే ఏపీ ప్రభుత్వం మాత్రం 2 వేలు ఇచ్చింది. అక్కడి నిర్వాసితులు తెలంగాణలో కలపండి అంటున్నారు… అందుకు ఏపీ ప్రభుత్వం సిగ్గుపడాలి. పోలవరం ప్రాజెక్టు లో ముఖ్యమైనది ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కట్టలేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ప్రత్యేక్షంగా పరోక్షంగా ఉపయోగపడే ప్రాజెక్ట్ పోలవరం. నీతి ఆయోగ్ మీటింగ్ లో ప్రత్యేక హోదా ఎలానో వదిలేశారు…. కనీసం పోలవరం ప్రాజెక్ట్ గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదన్నారు రామకృష్ణ. పోలవరం బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు సీపీఐ నేత రామకృష్ణ.

COVID 19 Update: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే..?

Exit mobile version