కర్నూలు జిల్లా ఆలూరు మండలం వుళేబీడు గ్రామ సమీపంలో వేరు శనగ పంట పొలాలలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. ఆలూరులో మంత్రి జయరాం ఉండి కూడా పంట పొలాలను పరిశీలించకపోవడం చాలా బాధాకరం అని ఆయన వ్యాఖ్యనించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాకు వచ్చి బటన్ నొక్కి వెళ్ళాడు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాల మంత్రులు కరువుపై ముఖ్యమంత్రి దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు.
Read Also: Team India: హార్ధిక్ లేని లోటును ఏ ప్లేయర్ తీర్చనున్నాడు.. ఫ్యాన్స్లో ఆందోళన
రైతుల సమస్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి, మంత్రులకు పట్టలేదు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గత రెండు రోజులుగా నేను పంట పొలాలను పరిశీలించినప్పుడు పూర్తిగా అన్ని పంటలు దెబ్బతిన్నాయి.. రైతులు పూర్తిగా నష్టపోయారు వెంటనే కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు సీపీఐ పార్టీ శ్రీకారం చుడుతుంది అని రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులను పట్టించుకునే ప్రభుత్వం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వేరు శనగ పంటను చూస్తుంటే గుండెలో బాధ కలిగిందని ఆయన అన్నారు. వెంటనే జగన్ సర్కార్ రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని సీపీఐ రామకృష్ణ డిామాండ్ చేశారు.