ఏపీలో మోటార్లకు మీటర్ల బిగింపు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. కేంద్రం నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగింపును వ్యతిరేకిస్తూ అనంతపురంలో సీపీఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. గాంధీ సర్కిల్ నుంచి పవర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు.
అందులో భాగంగా ఎద్దుల బండిలో రైతులు ఉరికి వేలాడుతూ నిరసన తెలిపారు. ఎద్దుల బండిని తోలారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. మోటార్లకు మీటరు పెట్టడం అంటే రైతుల మెడకు ఉరితాడు వేయడమే. గతంలో చంద్రబాబు విద్యుత్తు సంస్కరణలు అంటే ఈ రోజు అధికారం కోల్పోయి రాప్తాడులో తిరుగుతున్నాడు. జగన్ మీటర్లు బిగిస్తే… జనం బంగాళాఖాతంలో కలుపుతారు.
మోడీ ప్రపంచ జీతగాడు అయితే జగన్ మోడీ, అమిత్ షా చేతిలో కీలుబొమ్మగా మారారన్నారు. మీటర్ల బిగింపు విషయంలో ప్రభుత్వం ముందుకు వెళితే ప్రజా పోరాటాలు తప్పవు. ప్రజల మెడకు ఉరి తాడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండలేడన్నారు నారాయణ. మోటార్లకు మీటర్లను రైతులంతా వ్యతిరేకించాలన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. రాజకీయపార్టీలు అన్నీ మీటర్లపై మండిపడుతున్నాయి.
Disha Encounter : సుప్రీం కోర్టు తీర్పులో బిగ్ ట్విస్ట్..?