ఏపీలో మోటార్లకు మీటర్ల బిగింపు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. కేంద్రం నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగింపును వ్యతిరేకిస్తూ అనంతపురంలో సీపీఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. గాంధీ సర్కిల్ నుంచి పవర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా ఎద్దుల బండిలో రైతులు ఉరికి వేలాడుతూ నిరసన తెలిపారు. ఎద్దుల బండిని తోలారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రభుత్వం తీరుపై…