Site icon NTV Telugu

CPI Narayana: బిగ్‌బాస్‌ షోపై సంచలన వ్యాఖ్యలు.. అదో అధికారిక వ్యభిచార గృహం..!

బుల్లితెర ప్రేక్షకులకు నాన్‏స్టాప్ ఎంటర్‏టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రముఖ రియాల్టీ షో బిగ్‏బాస్.. ఇప్పటి వరకు గంట మాత్రమే ఉండే ఈ షో.. ఇవాళ్టి (ఫిబ్రవరి 26వ తేదీ) నుంచే ఓటీటీ తొలి సీజన్ మొదలుకాబోతోంది. ఈ మధ్యనే బిగ్ బాస్ తెలుగు ఓటీటీ తొలి సీజన్ ప్రోమో కూడా విడుదలైంది.. డిస్నీ హాట్ స్టార్‌లో ఈ షో ప్రసారం కాబోతోంది.. అయితే, బిగ్‌బాస్‌ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బిగ్‌బాస్‌ షో ఓ అధికారిక వ్యభిచార గృహం అంటూ వ్యాఖ్యానించారు.

Read Also: Russia-Ukraine conflict: ఉక్రెయిన్‌లోని భారతీయులకు కొత్త మార్గదర్శకాలు

బిగ్‌ బాస్‌ షోకు వ్యతిరేకంగా ఇప్పటికే లేఖలు రాశాం.. కేసు పెడదామని ప్రయత్నిస్తే తమ పరిధి కాదంటున్నారు.. కోర్టులో కేసులు వేశాం.. ఇప్పుడు సీపీఐ ఆధ్వర్యంలో బిగ్‌ బాస్‌ షోకు వ్యతిరేకంగా డిజిటల్‌ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు నారాయణ… బిగ్ బాస్ షో ఓ అధికారిక వ్యభిచార గృహం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన… లోపల ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు.. 200 కెమెరాలు పెట్టాం అంటున్నారు… అంతా ఎడిటింగ్‌తో ఇస్తున్నారన్న ఆయన.. ఏ సందేశం ఇవ్వాలని ఈ షో నిర్వహిస్తున్నారు… ఆ షో ని వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్‌ చేశారు. ఓటీటీ బిగ్ బాస్ ఇంటిని చూపించిన షో యాజమాన్యం ఈ షోకు నాగార్జునే హోస్ట్‌గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే కాగా.. అక్కినేని నాగార్జునపై కూడా మండిపడ్డారు నారాయణ.. అన్నమయ్య , రామదాసు లాంటి సినిమా చేసిన నాగార్జున ఇలాంటి షోకు హోస్ట్‌గా చేయడం సిగ్గుచేటన్నారు నారాయణ. కాగా, గతంలో మాదిరి కాకుండా.. ఇప్పుడు 24 గంటల పాటు ఓటీటీలో బిగ్‌బాస్‌ షో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Exit mobile version