Site icon NTV Telugu

Ramakrishna: కాకాని ఫైల్ మాత్రమే ఎలా ఎత్తుకెళ్తారు..?

నెల్లూరు కోర్టులో దొంగలు పడడం కలకలం సృష్టించింది.. ఈ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు.. అయితే, నెల్లూరు ఎస్పీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.. నెల్లూరు కోర్టులో కాకాని ఫైల్ మాత్రమే దొంగలు ఎలా దొంగతనం చేస్తారు..? అని ప్రశ్నించారు.. ఎన్నో ఫైళ్లు ఉండే కోర్టులో ఒక కాకాని ఫైల్ మాత్రమే దొంగలకు దొరికిందా..? నెల్లూరు ఎస్పీ ఖాకి డ్రెస్ వేసుకున్నారా..? లేదా..? అనే అనుమానం కలుగుతోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్క్రాప్ దొంగలకు కోర్టులో కాకాని ఫైల్ దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి..? అని నిలదీసిన ఆయన.. పోలీసులు ఖాకి డ్రెస్ కాకుండా వేరే డ్రెస్ వేసుకుంటే మంచిదని.. ఐపీఎస్ అధికారులు ఇంట్లో పోలీసు సర్వీస్ గా మారిపోయారని విమర్శించారు. ఇక, నెల్లూరు కోర్టులో ఫైల్స్ మాయంపై హైకోర్టుకి లేఖ రాస్తామని వెల్లడించారు రామకృష్ణ.

Read Also: KTR: రాజకీయాలకు అతీతంగా ఉంటేనే దేశం అభివృద్ధి.. ఆ విశ్వాసం మాకుంది..

మరోవైపు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా కేంద్రం జాప్యం చేస్తుందని విమర్శించారు రామకృష్ణ.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కుమ్మక్కై ఎత్తు తగ్గిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్‌ సర్కారు మూడేళ్లలో ఒక కాలువ నిర్మాణం కూడా పూర్తి చేయలేదని.. ఒక ఎకరాకు నీరు ఇవ్వలేదు విమర్శించారు.. త్వరలో పోలవరం ప్రాజెక్టు పనులను సీపీఐ తరుపున పరిశీలిస్తామని వెల్లడించారు. ఇక, ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబుకు అసలు ప్రాజెక్టులపై అవగాహన లేదని ఎద్దేవా చేశారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.

Exit mobile version