Site icon NTV Telugu

CPI Ramakrishna: బీజేపీ, మజ్లీస్‌ పార్టీలు మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పార్టీలు..

Cpi Ramakrishna

Cpi Ramakrishna

CPI Ramakrishna: జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ సనాతన ధర్మం పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాని భుజాన మోస్తే ప్రజలు హర్షించరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఎన్నికల ముందు తనకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడటం రాజకీయంగా నష్టం జరిగినా పర్వాలేదని చెప్పటం ఆశ్చర్యం.. త్రివిక్రమ్‌ సినిమాల్లో పాత్రకి తగినట్లు ఒక్కో సినిమాలో ఒక్కో డైలాగ్‌ ఉంటుంది అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, అధికారంలోకి వచ్చిన తరువాత సినిమాల్లో మాదిరిగా పవన్‌ వ్యవహారశైలి ఉంది.. బీజేపీ, మజ్లీస్‌ పార్టీలంటే అవి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పార్టీలని ప్రజలు అర్థం చేసుకుంటారు అని రామకృష్ణ వెల్లడించారు.

Read Also: Mumbai: మెట్రో ఫేజ్-3ను ప్రారంభించిన మోడీ.. విద్యార్థులతో ప్రధాని ముచ్చట్లు

ఇక, జనసేన లౌకిక పార్టీ, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు లౌకికవాదులే అని సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు. అణగారిన కులాలను, వెనుకబడిన వర్గాలను, మహిళలను కించపర్చే విధానం సనాతన ధర్మంలో ఉంటుంది.. జనసేన పార్టీలో వివిధ కులాలు, మతాలు, ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.. జనసేన అధినేత వైఖరిని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు సరిదిద్దాలి అని వెల్లడించారు.

Exit mobile version