ఏపీలో కరోనా విశ్వరూపం… నిబంధనలు పాటించని జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఏ రాష్ట్రాన్నీ వదలడం లేదు. నెల క్రితం వందల్లో వున్న కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు వేలల్లోకి చేరాయి. తాజాగా ఏపీలో కరోనా భారీగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
గుంటూరు, విశాఖ, చిత్తూరు జిల్లాలలో కరోనా కట్టడిపై అధికారులు చేతులెత్తేశారేమో అనిపిస్తోంది. జిల్లాలో రాజకీయ పార్టీల కార్యక్రమాలు, తెరుచుకున్న సినిమా థియేటర్లతో పాటు సందడి ఎక్కువైంది. మూడు నెలలుగా కరోనా కొత్త వేవ్ వస్తుందని ప్రపంచం మొత్తం మొత్తుకుంటున్నా అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లయినా లేదేమో అనిపిస్తోంది.
Also Read
- Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
- OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నా వ్యాక్సిన్ వేయించుకున్న ధీమానో ఏమో తెలీదు గానీ కరోనాను లైట్ తీసుకుంటున్నారు. కరోనా వ్యాధిని అరికట్టడంలో అధికారులు సైతం చిత్తశుద్ధి చూపించడం లేదు. తెరుచుకున్న సినిమా థియేటర్లు, స్కూల్స్, షాపింగ్ మాల్స్ ఒకటేంటి ..ఇప్పుడు ఏకంగా ఎగ్జిబిషన్ లు కూడా పెట్టి కరోనాను వైఫై మాదిరిగా ఇంటింటికి పంపిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులవారు కనీస బాధ్యత, స్పృహ లేకుండా కరోనాని కాసుల కలెక్టింగ్ కి వాడేస్తున్నారు. వాస్తవానికి ఏదైనా బహిరంగంగా అ సమావేశం ఏర్పాటు చేసుకోవాలంటే, 200మంది లోపు ప్రజలు వచ్చేలాగా కరోనా నిబంధనలు పాటించే లాగా ఆంక్షలు ఉన్నాయి… ప్రభుత్వ కార్యక్రమాలు అయితే కొంతమేర పర్లేదు, అక్కడ కచ్చితంగా కొవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నారు . కానీ కొందరు అసలు నిబంధనలు పాటించడం లేదు.
గడచిన 24 గంటల్లో 44,516 కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా 13,212 మందికి పాజిటివ్ గా తేలింది. విశాఖ జిల్లాలో 2,244 పాజిటివ్ కేసులు రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక, చిత్తూరు జిల్లాలో 1,585 కేసులు, అనంతపురం జిల్లాలో 1,235 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 1,230 కేసులు, గుంటూరు జిల్లాలో 1,054 కేసులు, నెల్లూరు జిల్లాలో 1,051 కేసులు నమోదయ్యాయి.కరోనా మృతుల సంఖ్య 14,532కి పెరిగింది.
తాజావార్తలు
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
Ananya Panday: లైగర్ బ్యూటీకి కష్టకాలం.. రెండేళ్ల ప్రేమకు గుడ్‌బై!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
ట్రెండింగ్
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!