NTV Telugu Site icon

Nellore Rotten Meat Seize: నెల్లూరులో నాన్ వెజ్ కొంటున్నారా? బాబోయ్ ఇది తెలుసా?

Nellore Meat

Nellore Meat

నాన్ వెజ్ ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్.. నెల్లూరు నగరంలో భారీగా కల్తీ మాంసం పట్టుబడింది. తమిళనాడు నుంచి లివర్, కందనకాయల వ్యర్థాలను తక్కువ ధరకు తెచ్చి ఇక్కడ అమ్మేస్తున్నారు. నెల్లూరులో చికెన్‌ ధరకే విక్రయాలు సాగిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఐస్‌క్రీమ్‌ వాహనాల్లో తరలిస్తూ భారీగా చికెన్, మటన్ పట్టుబడింది. ఆరోగ్యశాఖ అధికారులు 400 కేజీలు పట్టుకున్నారంటే ఈ చికెన్ దందా ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.. ఇదంతా మూడునాలుగురోజుల క్రితం మాంసంగా గుర్తించారు.

కొంత కాలం క్రితం నిరంతరం నిఘాతో మున్సిపల్‌ హెల్త్‌ అధికారుల దాడులతో ఇలాంటి అమ్మకాలు సద్దుమణిగాయి. మళ్ళీ పుంజుకున్నాయి. మున్సిపల్‌ హెల్త్‌ అధికారుల దాడుల్లో నిల్వ ఉంచిన చికెన్‌తో పాటు లివర్, కందనకాయలు చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ డంప్‌ చేసి విక్రయాలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఓ ముఠా చెన్నై నుంచి నెల్లూరుకు భారీగా చికెన్‌ లివర్, కందనకాయలను దిగుమతి చేయడం వెలుగులోకి వచ్చింది. నెల్లూరులోని చికెన్‌ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్‌లకు వీటిని విక్రయిస్తుంటారు. కేవలం రూ.30 నుంచి రూ.40లకే అక్కడ దొరికే లివర్, కందనకాయలు తీసుకొచ్చి చికెన్‌ ధరలకు విక్రయిస్తారు.

Read Also: Extramarital Affair: సోదరుడితో భార్య ఎఫైర్.. వింత పని చేసిన భర్త

తమిళనాడులో నిల్వ ఉంచిన ఆహారాన్ని నెల్లూరుకు గుట్టుచప్పుడు కాకుండా వివిధ వాహనాల్లో దిగుమతి చేసుకుంటున్నారు. నెల్లూరుతో పాటు ఒంగోలు, గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు సైతం ఈ మాంసం తరలివెళుతుంది. విస్తృత తనిఖీలు అవసరం అనీ, ఇలాంటి మాంసం, మటన్ తింటే ఆరోగ్యం పాడవడం ఖాయం అంటున్నారు. మైపాడుగేటు వేణుగోపాల్‌నగర్‌లో ఉన్న ఓ చికెన్‌ స్టాల్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిల్వ ఉంచిన చికెన్‌ లివర్, కందనకాయలను ఆరిఫ్‌ అనే వ్యక్తి ఓ ఐస్‌క్రీమ్‌ వాహనం నుంచి దిగుమతి చేసుకుంటుండగా మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ వెంటకరమణ తనిఖీలు చేశారు. గతంలో వెంకటరమణ బృందం తనిఖీలు చేసింది.

మళ్లీ ఇప్పుడు తనిఖీలు ముమ్మరం కావడంతో వ్యాపారుల వెన్నులో వణుకు ప్రారంభం అయింది. ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో ముక్కలేనిదే ముద్ద దిగనివారికి ఈ తనిఖీలు షాకిచ్చాయి. తాము ఇలాంటి ఆహారం తింటున్నామా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అనారోగ్యం కలిగించే ఆహారాన్ని ఎవరైనా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు హెచ్చరించారు. చికెన్‌ స్టాల్‌కు నోటీసులు జారీ చేసి, రూ.25 వేలు జరిమానా విధించారు. చికెన్, మటన్ కొనేముందు అన్నీ ఆలోచించి కొనుగోలు చేయాలని, అనుమానం వస్తే తమకు ఫిర్యాదు చేయాలని హెల్త్ అధికారులు కోరుతున్నారు.

Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?