NTV Telugu Site icon

Constable Surendra Case update: కానిస్టేబుల్ సురేంద్ర నిందితుల కోసం గాలింపు

Body Dead

Body Dead

ఏపీలో సంచలనం కలిగించిన కానిస్టేబుల్ సురేంద్ర (constable Surendra) హత్యకేసులో నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు. నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్ర హత్యపై దర్యాప్తు వేగం పెంచారు. నిందితుల కోసం గాలిస్తున్న 5 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కానిస్టేబుల్ హత్య కేసులో కీలక నిందితుడు రౌడీ షీటర్ వెంకటసాయి అలియాస్ కవ్వుగాడుగా గుర్తించిన సంగతి తెలిసిందే. రౌడీ షీటర్ తండ్రి వెంకటేశ్వర్లు 20 ఏళ్ల క్రితం పోలీస్ ఎన్‌కౌంటర్ లో మృతి చెందాడు. కానిస్టేబుల్ సురేంద్ర కు రౌడీ షీటర్ వెంకటసాయి సమీప బంధువు.

పోలీసులు తరచూ కౌన్సెలింగ్ పిలవడంలో కానిస్టేబుల్ సురేంద్ర పాత్ర ఉందని పగ పెంచుకున్న వెంకట సాయి అతనిని ఎలాగైనా మట్టుబెట్టాలని ప్లాన్ చేశాడు. పద్మావతి నగర్ లో రోడ్డుపైనే వెంకటసాయి రౌడీ గ్యాంగ్ మద్యం సేవించడంపై అభ్యంతరం చెప్పాడు కానిస్టేబుల్ సురేంద్ర. పాత పగ గుర్తుకువచ్చి కానిస్టేబుల్ ను మద్యం బాటిళ్లతో దాడి చేసి కత్తులతో పొడిచి చంపేశాడు వెంకటసాయి గ్యాంగ్.

తప్పించుకునేందుకు ఎంతగా పరుగెత్తినా కానిస్టేబుల్ సురేంద్రను వేటాడి వెంటాడి పట్టుకొని ఆటోలో కిడ్నాప్ చేసి హత్య చేసింది రౌడీ గ్యాంగ్. అయితే కానిస్టేబుల్ సురేంద్ర హత్యపై నోరు మెదపడం లేదు పోలీస్ అధికారులు. నిందితులను పట్టుకున్నాకే మాట్లాడతామంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఈ ఘటనకు సంబంధించి సి.సి.కెమేరాలో సంఘటన దృశ్యాలు రికార్డయ్యాయి. హత్యకు పాల్పడింది ముగ్గురు రౌడీషీటర్లు, మరో ఇద్దరు నేరస్తులుగా పోలీసులు గుర్తించారు.

Constable Surendra: కానిస్టేబుల్ సురేంద్ర కేసులో నిందితులు ఎవరంటే?