Site icon NTV Telugu

హెరిటేజ్‌పై సీఎం జగన్‌ విమర్శలు..

ys jagan

గత టీడీపీ ప్రభుత్వం, హెరిటేజ్‌పై విమర్శలు గుప్పించారు సీఎం వైఎస్‌ జగన్.. జగనన్న పాలవెల్లువ, మత్స్యశాఖలపై సమీక్ష నిర్వహించారు సీఎం.. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య రూపొందించిన జగనన్న పాలవెల్లువ మహిళా డెయిరీ సహకార సంఘం– కార్యదర్శికి మార్గదర్శకాలు, జగనన్న పాలవెల్లువ- శిక్షణా కరదీపిక పుస్తకాలను ఆవిష్కరించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో సహకార రంగంలోని డెయిరీలను స్వప్రయోజనాలకు మళ్లించారని.. కొందరు సహకార డెయిరీలను తమ ప్రైవేటు సంస్థలుగా మార్చుకున్నారని ఆరోపించారు.. సహకార రంగాన్ని వ్యవస్థీకృతంగా ధ్వంసం చేశారని ఆరోపించిన సీఎం వైఎస్‌ జగన్.. హెరిటేజ్‌కు మేలు చేయడానికి ఏ సహకార సంస్థనూ సరిగ్గా నడవనీయని పరిస్థితులను సృష్టించారని విమర్శించారు..

Exit mobile version