ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. తొలిరోజే వాడీవేడీగా సాగింది సభ.. ఇక, ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బీఏసీ… టీడీపీ ప్రతిపాదించిన 19 అంశాలను చర్చించడానికి అంగీకారం తెలిపింది ప్రభుత్వం.. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకి ఆఫర్ ఇచ్చారు.. మీరు ఏ అంశం కావాలన్న చర్చకు మేం రెడీ.. సభలో చర్చకు సహకరిస్తారా..? లేదా..? అని ప్రశ్నించారు.. మీరు కోరే ప్రతి అంశంపైనా చర్చిస్తాం.. అవసరమైతే ఈఎస్ఐ స్కామ్ పై కూడా చర్చిద్దాం అంటూ అచ్చెన్నాయుడుకు పంచ్ విసిరారు సీఎం జగన్. రాజధాని కావాలంటే… అది కూడా చర్చకు పెడతాం అన్నారు.
Read Also: TRS vs BJP: కేటీఆర్ కౌంటర్ ఎటాక్.. విశ్వగురు ఉచితాలు వద్దంటారు.. జోకర్ ఎంపీ ఫ్రీ ఫ్రీ అంటారు..!
ఇక, టీడీపీ సభ్యులు తీరుపై బీఏసీలో అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రులు.. మీరు చర్చ కు సహకరించకుండా గొడవ చెయ్యడం సమంజసం కాదని హితవుపలికారు.. నువ్వే రెచ్చగొట్టి ఎమ్మెల్యేలను గొడవకు పంపిస్తున్నావు.. మీరు ఒకటి అంటే.. మేం నాలుగు అంటాం.. మా సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని అంటే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు మంత్రులు జోగి రమేష్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. కాగా, బీఏసీ సమావేశంలో.. ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. తెలుగు దేశం పార్టీ ప్రతిపాదించిన 19 అంశాలను చర్చించడానికి అంగీకారం తెలిపింది వైసీపీ ప్రభుత్వం.
