NTV Telugu Site icon

CM YS Jagan: రాబోయే రోజుల్లో రైతుకు మెరుగైన రేటు వచ్చే పరిస్థితి వస్తుంది

Ys Jagan

Ys Jagan

CM YS Jagan Mohan Reddy Virtually Started Food Processing Units In Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తిరుపతి జిల్లా శ్రీసిటీలో మోన్‌‌డలీజ్‌ ఇండియా పుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యూనిట్‌కు, సత్యసాయి జిల్లా ధర్మవరంలో గ్రౌండ్‌నట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు శంకుస్ధాపన చేశారు. అలాగే.. చిత్తూరు జిల్లాలో 3, అన్నమయ్య జిల్లాలో ఒకటి చొప్పున మొత్తం నాలుగు పండ్లు, కూరగాయల ప్రైమరీ ప్రాసెసింగ్‌ యూనిట్లను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 3 టమోట ప్రైమరీ ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం జగన్.. విజయనగరం జిల్లా ఎల్‌ కోట మండలం రేగ గ్రామంలో మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను, కర్నూలు జిల్లా తడకనపల్లెలో 100 మైక్రో యూనిట్స్‌తో ఆనియన్‌ అండ్‌ టమోట సోలార్‌ డీ హైడ్రేషన్‌ క్లస్టర్‌ను ప్రారంభించారు.

Anakapalli Crime: భార్యపై అనుమానంతో.. భర్త కిరాతక పని

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇవాళ 421 ప్రైమరీ ప్రాసెసింగ్‌ కలెక్షన్‌ సెంటర్లను ప్రారంభించుకున్నామని, ఇవన్నీ 1912 ఆర్బీకేలకు మ్యాప్‌ చేయబడ్డాయని అన్నారు. మొత్తం 945 కలెక్షన్‌ సెంటర్లకు ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. అదే విధంగా తొలిదశలో 344 కోల్డ్‌ రూమ్‌ల పనులు జరుగుతున్నాయని.. వీటిలో 43 కోల్డ్‌ రూమ్‌లను ఈరోజు ప్రారంభించుకున్నామని చెప్పారు. ఇవి కూడా దాదాపు 194 ఆర్బీకేలతో అనుసంధానమై ఉన్నాయన్నారు. ప్రతి ఆర్బీకేను కోల్డ్‌ రూమ్స్, కలెక్షన్‌ సెంటర్లకు మ్యాపింగ్‌ చేస్తూ.. ప్రైమరీ ప్రాసెసింగ్‌లో డ్రయ్యింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు, కలెక్షన్‌ సెంటర్లు, వ్యవసాయ ఉపకరణాలు వంటి వాటిని ఆర్బీకే పరిధిలో తీసుకుని పోవాలని సూచించారు. గ్రేడింగ్, సెగ్రిగేషన్‌ వంటి కార్యక్రమాలు ఆ స్ధాయిలో జరిగితే.. సెకండరీ ప్రాసెసింగ్‌ అనేది జిల్లా స్ధాయిలో, జిల్లాకొకటి ఉండేటట్టుగా అడుగులు పడుతున్నాయన్నారు. రైతులు తాము అమ్ముకోవాల్సిన ఉత్పత్పులను ఆర్బీకేల ద్వారా కొనుగోలు జరిగేలా చేస్తున్నామని తెలియజేశారు.

Vaishnavi Chaitanya: ‘బేబీ’ని మెచ్చిన ఇస్మార్ట్ రామ్.. వాటిని పట్టుకొని గాల్లో తేలిపోతున్న వైష్ణవి

అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వం ఇవ్వని పంటలకు కూడా కనీస మద్ధతు ధర ఇస్తూ, ఆర్బీకేలలో పోస్టర్లలో డిస్‌ప్లే చేశామన్నారు. ఏ ఆర్బీకే పరిధిలోనైనా ఆ పంటకు సంబంధించిన ధర పడిపోతే.. ఆర్బీకే స్ధాయిలోనే జోక్యం చేసుకుని, మద్ధతు ధరకు కొని రైతును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ ప్రైమరీ, సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్లన్నీ ఉపయోగపడతాయన్నారు. ఈ మార్పులన్నింటితో రాబోయే రోజుల్లో.. రైతుకు తాను పండించే పంటకు ఇంకా మెరుగైన రేటు వచ్చే పరిస్థితి వస్తుందని శుభవార్త తెలిపారు. శ్రీసిటీలో మరో రూ.1600 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులకు శంకుస్ధాపన చేయడం ఆనందం కలిగిస్తోందని.. మోన్‌‌డలీజ్‌ కంపెనీ రెండో విడతలో రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న నమ్మకాన్ని మరోసారి స్పష్టం చేసిందని అన్నారు. చాక్‌లెట్, క్యాడ్‌బెర్రీ, బోర్న్‌విటా వంటివి తయారు చేస్తున్న ఈ ప్యాక్టరీ.. దినదినాభివృద్ది చెందాలని, మంచి జరగాలని ఆయన కోరుకున్నారు.

Adah sharma : నెటిజన్స్ ను మోసం చేస్తూ దొరికిపోయిన అదా శర్మ..?

ధర్మవరంలో పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు ద్వారా.. ధర్మవరం ప్రాంతానికి సంబంధించిన వేరుశెనగ రైతుల పంటకు మరింత విలువ పెరుగుతుందని సీఎం జగన్ తెలిపారు. వేరుశెనగ రైతులకు మెరుగైన ధరలు ఇవ్వగలిగే పరిస్థితి రావాలని ఈ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. ధరల స్థిరీకరణనిధి ద్వారా రూ.3వేల కోట్లు ప్రతి సంవత్సరం కేటాయించడంతో పాటు, ఈ నాలుగేళ్లలో దాదాపు రూ.8వేల కోట్లు ఇతర పంటల కొనుగోలు కోసం ఖర్చు చేశామని చెప్పారు. మార్కెట్‌లో రైతులకు పంట మద్ధతు ధరలు తగ్గినప్పుడు.. వారికి తోడుగా ఉండేందుకు రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేస్తున్నామని వెల్లడించారు. రైతులకు మద్ధతు ధరలు లభించనప్పుడు.. ప్రభుత్వమే జోక్యం చేసుకుని ఆర్బీకేల ద్వారా వారికి మద్ధతు ధరలు కల్పిస్తుందన్నారు. ఆర్బీకేలో డిస్‌ప్లే చేసిన రేటు కన్న రైతులకు తక్కువ ధర వస్తే.. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ పంటలను సేకరిస్తుందన్నారు.

Homeguard Harassment: కీచక హోంగార్డ్.. పోలీస్ స్టేషన్‌లోనే వివాహితపై..

రూ.75 కోట్లతో వేరుశెనగ ప్రాసెసింగ్‌ యూనిట్‌‌ను ధర్మవరంలో ఏర్పాటు చేస్తున్నామని, ఇది సత్యసాయి జిల్లా రైతులకు అన్నిరకాలుగా ఉపయోగపడుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. 55,620 మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యంతో ఈ యూనిట్‌ 15 వేల మంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మరో 9 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తయితే.. ఈ ప్రాంతంలో వేరుశెనగ పంట నుంచి చిక్కీ, వేరుశెనగ ఆయిల్, పీనట్‌ బట్టర్‌ వంటి ఇతర ఉప ఉత్పత్తులు తయారై.. పంటకు మార్కెటింగ్‌ పెరుగుతుందని, దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు నాలుగు ప్రైమరీ ప్రాసెసింగ్‌ యూనిట్లను చిత్తూరులో జిల్లాలో 3, అన్నమయ్యజిల్లాలో ఒకటి చొప్పున ప్రారంభిస్తున్నామని.. దాదాపు 14,400 మెట్రిక్‌ టన్నులకు సంబంధించి పండ్లు, కూరగాయల పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ప్రారంభిస్తున్నామని చెప్పారు. దీనివల్ల మార్కెటింగ్‌ సౌకర్యం పెరిగి, రైతులకు మంచి ధరలు లభిస్తాయన్నారు.

Kakani Govardhan Reddy: చంద్రబాబు ఉంటే.. కరువు రాజ్యమేలుతుంది

సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 3,588 మంది రైతులుకు మేలు చేస్తూ.. దాదాపు 10,800 టన్నుల టమోట ప్రాసెసింగ్‌ చేసే యూనిట్లకు ఈరోజు శంకుస్ధాపన చేసుకున్నామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. మరో నాలుగు నెలల్లో వీటిని ప్రారంభించుకోబోతున్నామని, దీనివల్ల టమోట రైతులందరికీ మంచి జరుగుతుందని, రైతులకు అన్ని సౌకర్యాలు లభిస్తాయని తెలిపారు. వీటికి అదనంగా 250 మెట్రిక్‌ టన్నుల కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటుతో మార్కెట్‌లో టమోట రైతుల ఇబ్బందులు తీరుతాయన్నారు. మార్కెట్‌లో ధరలు పడిపోయినా.. అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా పోతుందని, మంచి ధరలకు అమ్ముకునే అవకాశం కలుగుతుందని వెల్లడించారు. మిల్లెట్స్‌లో దాదాపు 13 సెకెండరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మరో 32 పైచిలుకు ప్రైమరీ ప్రాసెసింగ్‌ మిల్లెట్‌ యూనిట్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు.

MLA Sudhakar: పవన్ కళ్యాణ్‌ని ఫ్యాన్స్ నమ్మొద్దు.. ఆయన్ను సినిమా వరకే చూడండి

దేశంలో ఎక్కడా జరగని విధంగా మిల్లెట్స్‌కు ఎంఎస్‌పీ అందించింది కూడా మన రాష్ట్రంలోనేనని సీఎం జగన్ ఉద్ఘాటించారు. మిల్లెట్స్‌ రేటు పడిపోతే.. జోక్యం చేసుకుని కొర్రలు వంటి చిరుధాన్యాలకు కూడా ఎంఎస్‌పీ అందించామన్నారు. ఇందులో భాగంగా విజయనగరంలో సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ 7,200 మెట్రిక్‌ టన్నుల కెపాసిటీతో రావడం ఈ ప్రాంతంలో రైతులకు మంచి జరుగుతుందన్నారు. రైతుల ఉత్పత్తులకు మంచి ధరలు వస్తాయన్నారు. అదే విధంగా కర్నూలులో ఆనియన్‌ డీహైడ్రేషన్‌ కార్యక్రమాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద వంద చోట్ల చేస్తున్నామని.. రూ.1 లక్ష పెట్టుబడితో ప్రతిఒక్కరికి దాదాపు రూ.12వేల ఆదాయాన్నిచ్చే కార్యక్రమమిదని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ యూనిట్లను మరింత విస్తరిస్తూ ఐదువేల వరకు పెంచుతామని సీఎం జగన్ స్పష్టం చేశారు.