Site icon NTV Telugu

CM YS Jagan: ఏపీ సీఎం కీలక ప్రకటన.. వారిపై కేసులు ఎత్తివేత..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రా‌సిం ఇండస్ట్రీ కోర్ ఆల్కలీ యూనిట్‌ను బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి ప్రారంభించారు… అనంతరం కీలక ప్రకటన చేశారు.. 131 మంది ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు సీఎం వైఎస్‌ జగన్.. గతంలో బలభద్రపురంలో కాలుష్య పరిశ్రమ వద్దంటూ కేపీఆర్‌ వ్యతిరేక ఉద్యమం జరిగింది.. ఈ సందర్భంగా 131 మందిపై కేసులు నమోదు చేశారు.. అయితే, ఇవాళ ఆ కేసులు ఎత్తివేస్తున్నట్టు వెల్లడించారు ఏపీ సీఎం… ఇక, ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తూ జీ.వో. నంబర్ 321ను విడుదల చేశారు.. సంబంధిత జీవో కాపీని స్వయంగా ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డికి అందజేశారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్.

Read Also: CM Jagan: గ్రాసిమ్ పరిశ్రమతో రూ.2,700 కోట్ల పెట్టుబడులు.. 2,500 మందికి ఉద్యోగాలు

Exit mobile version