CM KCR: ఆత్మీయుడిని కోల్పోయా… సీఎం కేసీఆర్ సంతాపం
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఆకస్మిక మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. బొజ్జల మృతికి సంతాపం తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఓమంచి సహచరుడిని , ఆత్మీయుడిని కోల్పోయానంటూ సదరు ప్రకటనలో పేర్కొన్నారు. బొజ్జల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు కేసీఆర్ కూడా టీడీపీలో కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలతో కేసీఆర్ అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. అలాంటి నేతల్లో బొజ్జల కూడా ఒకరు. ఈ కారణంగానే బొజ్జల మృతి వార్త తెలిసిన వెంటనే అత్యంత ఆత్మీయుడిని కోల్పోయానంటూ కేసీఆర్ సంతాపం ప్రకటించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం సమయంలో టీడీపీ తరఫున కేసీఆర్‌ని బుజ్జగించారు బొజ్జల.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి వయసు 73 సంవత్సరాలు. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవలే హైదరాబాద్‌లోని బొజ్జల నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
Also Read
- Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
- School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
- AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్‌లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
- AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
Breaking News: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత
తాజావార్తలు
-
Vijay: ఆలయాల బాట పట్టిన విజయ్.. టీవీకే శ్రేణుల్లో నూతనోత్సాహం
-
Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
-
Heinrich Klaasen: ఆటో ప్రయాణం, రెస్టారెంట్.. సాధారణ వ్యక్తిలా హైదరాబాద్ చుట్టేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ
-
Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!