CM Jaganmohan Reddy:ఎల్లుండి కోనసీమలో సీఎం జగన్ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎల్లుండి కోనసీమ జిల్లాలో జరిగే సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారు సీఎం జగన్. అంతకుముందు జగన్ పర్యటనతో అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుతో కలిసి అమలాపురం ఆర్డీవో వసంత రాయుడు హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైయస్ జగన్ క్షేత్రస్థాయిలో పర్యటించి.. బాధితులతో మాట్లాడనున్నారు. కోనసీమ జిల్లాలోని 18 మండలాలకు సంబంధించి 51 లంక గ్రామాలు వరద నీటిలో మునిగి ఉన్నాయి. వరద ముంపుతో లంక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బాధితులకు అండగా ప్రజాపత్రినిధులు పర్యటన చేస్తున్నారు. బాధితులకు ధైర్యాన్ని ఇస్తున్నారు. వరద వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి.
రాజోలు, పి. గన్నవరం నియోజకవర్గాల్లోని లంక ప్రాంతాల్లో సీఎం పర్యటన నేపథ్యంలో బాధితులకు జగన్ ఏం ప్రకటిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గోదావరి వరద కారణంగా లంక గ్రామాల వాసులు ఇప్పటికే వరద నీటిలోనే వుండిపోయారు. పి.గన్నవరం మండలం గంటిపెదపూడి వద్ద నదిపాయ తెగి ఇబ్బందులు పడుతున్న నాలుగు గ్రామాల ప్రజలతో పాటు లంకల గన్నవరం, మానేపల్లిలో వరద బాధితులను జగన్ పరామర్శిస్తారు.
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
జిల్లాలో దెబ్బతిన్న పంటలను జగన్ పరిశీలిస్తారు. వరద నష్టాన్ని అంచనా వేసి తయారుచేసే నివేదికను సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి అందజేసి సాయం కోరనున్నారు. సీఎం జగన్ రాక సందర్భంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. జగన్ తన పర్యటనలో భాగంగా అన్నంపల్లి అక్విడెక్ట్ ప్రాజెక్టుకు చేరుకుంటారు. వరదలకు ఈ ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని తెలుసుకుంటారని అధికారులు తెలిపారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే.
Adimulapu Suresh: వరదల్లో తక్షణం స్పందించాం.. వివాదాలు తేవద్దు
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..