NTV Telugu Site icon

CM JaganMohan Reddy: కావలిలో సీఎం జగన్ పర్యటన.. చుక్కల భూములకు పట్టాల పంపిణీ

Ys Jagan

Ys Jagan

ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శుక్రవారం విజ‌య‌వాడ‌, నెల్లూరు జిల్లా కావలిలో ప‌ర్యటించ‌నున్నారు. విజయవాడలో అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొంటారు. అనంతరం నెల్లూరు జిల్లా కావలిలో చుక్కల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కు కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

Read Also: Atrocious : ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లి 13ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

విజయవాడలో ఉదయం 8.25 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం చేరుకుంటారు. అక్కడ ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పాల్గొంటారు, అనంతరం 9.35 గంటలకు తాడేపల్లి హెలీప్యాడ్‌కు చేరుకుని కావలి బయలుదేరుతారు.

కావలిలో చుక్కల భూములకు పట్టాల పంపిణీ
ఉదయం 9.35 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.30 గంటలకు కావలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంకు చేరుకుంటారు. ఆ తర్వాత కావలి మినిస్టేడియంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని చుక్కల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కు కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించ‌నున్నారు. కార్య‌క్ర‌మం అనంతరం కావ‌లి నుంచి బయలుదేరి సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ. 20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని నేడు నెల్లూరు జిల్లా కావలిలో ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Agniveers: అగ్నివీరులకు రైల్వే ఉద్యోగాల్లో 15 శాతం రిజర్వేషన్లు.. వయోపరిమితిలోనూ ఉపశమనం

Show comments