Atrocious : ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లి 13ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious : దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వాలు మహిళ రక్షణ కోసం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన వారిపై ఆగడాలు అదుపుకావడం లేదు. ప్రతి రోజు దేశంలో ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కామాంధులు రెచ్చిపోయి చిన్నారులు, వృద్ధులు అనే తేడా లేకుండా ఆడది అయితే చాలు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. దారుణం ఏంటంటే మహిళలు దివ్యాంగులు అని జాలి కూడా చూపకుండా అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా యూపీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 13 ఏళ్ల దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Read Also: Wedding Gown : ఈ పెళ్లి గౌన్ గిన్నీస్ రికార్డ్ సాధించిందా.. ఏముంది అందులో స్పెషాలిటీ ?
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
అమేథీ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేథీ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఓ గ్రామంలో దళిత కుటుంబం నివసిస్తోంది. బుధవారం రాత్రి ఆ కుటుంబంలోని 13 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన వారిస్(20), ఇంకో వ్యక్తి కలిసి ఎత్తుకెళ్లారు. అనంతరం జనసంచారం లేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాలికను రాత్రంతా వారితో ఉంచుకొని గురువారం ఉదయం ఇంటికి పంపించారు. ఏం జరిగిందని బాధితురాలి తండ్రి ఆరా తీశాడు. తనపై జరిగిన దారుణం గురించి వివరించింది. దీంతో తండ్రి పోలీసులను ఆశ్రయించారు. తమ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తన కూతురుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు ఆ ఇద్దరు నిందితులపై భారతీయ శిక్షాస్మృతి, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద నిందితులపై స్థానిక మోహన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!