CM Jagan: ఆదోనిలో జగన్ టూర్.. ఇవాళ విద్యాకానుక పంపిణీ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్నారు. ఉదయం 10.20 నుంచి 10.30 వరకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో వినతిపత్రాలు తీసుకోనున్నారు సీఎం. 10.45 నుంచి 10.50 వరకు మున్సిపల్ స్కూల్ ను సందర్శించనున్నారు సీఎం. 10.55 నుంచి 11.15 వరకు నాయకులు, అధికారులను సీఎం జగన్ కలుస్తారు. సభలో విద్యార్థులకు విద్యా కానుక పంపిణీ చేసి ప్రసంగించనున్నారు సీఎం జగన్. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ నెల 5వ తేదీ మంగళవారం జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేస్తున్నారు. విద్యా కానుక కిట్ల పంపిణీకి ఆదోని మున్సిపల్ క్రీడా మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త తలశిల రఘురామ్ ఏర్పాట్లను పరిశీలించారు.
Ban on service charges: సర్వీస్ చార్జీలపై నిషేధం.. సీసీపీఏ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్
Also Read
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్ధుల కోసం జగనన్న విద్యాకానుక కిట్లను మూడో ఏడాది అందించేందుకు వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సిద్దమైంది. విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టింది. మన బడి నాడు నేడు కింద రూ. వేల కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. జగనన్న విద్యాకానుక కింద విద్యార్ధుల చదువులకు అవసరమయ్యే వస్తువులను కిట్ల రూపంలో అందిస్తోంది. జగనన్న గోరుముద్ద ద్వారా రుచికరమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సమకూరుస్తోంది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు ఏటా పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేపట్టింది. ప్రభుత్వ కార్యక్రమాలతో విద్యార్ధుల చేరికలు భారీగా పెరిగాయి.
విద్యపై పెట్టే వ్యయం విద్యార్ధుల భవిష్యత్‌కు పెట్టుబడి అనే మహోన్నత ఆలోచనతో సీఎం వైఎస్ జగన్ ఏటా విద్యారంగానికి బడ్జెట్లో వేల కోట్లు కేటాయిస్తున్నారు. బడులు తెరిచిన తొలిరోజే జగనన్న విద్యాకానుక క్రింద ప్రతి విద్యార్ధికి ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్ కుట్టుకూలితో సహా అందిస్తారు. ఒక జతల బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, బై లింగువల్ టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్‌తో పాటు అదనంగా ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు – తెలుగు డిక్షనరీని ప్రభుత్వం అందజేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదో తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్ధినీ, విద్యార్ధులకు రూ. 931.02 కోట్ల ఖర్చుతో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ జరుగుతుంది. ప్రతి విద్యార్థికి రూ. 2,000 విలువైన జగనన్న విద్యా కానుక ద్వారా అందనున్నాయి. 2020 –21 విద్యా సంవత్సరంలో 42,34,322 లక్షల మంది విద్యార్ధులు లబ్ధి పొందగా, దానికి అయిన వ్యయం రూ. 648.10 కోట్లు. 2021 –22 విద్యా సంవత్సరంలో 45,71,051 లక్షల మంది విద్యార్ధులు లబ్ధి పొందగా, దానికి అయిన వ్యయం రూ. 789.21 కోట్లు. 2022 –23 విద్యా సంవత్సరంలో 47,40,421 లక్షల మంది విద్యార్ధులు లబ్ధి పొందనున్నారు. దానికి అయిన వ్యయం రూ. 931.02 కోట్లు. ఇదంతా కలిపి ఇప్పటివరకు చేసిన మొత్తం వ్యయం 2,368.33 కోట్లు.
America: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. ఆరుగురు మృతి, 24 మందికి గాయాలు
తాజావార్తలు
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
-
Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!