Site icon NTV Telugu

సీఎం జగన్ పాలనకు రెండేళ్లు.. రేపు పుస్తకం విడుదల

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు నిండింది. నవరత్నాలు పేరుతో ఆయన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేయడమే వైసీపీ ప్రధాన ఎజెండాగా సాగుతుంది. ఇక కరోనా ప్రధానంగా ఈ రెండేళ్లలోనూ వెంటాడింది. గత మార్చిలో మొదలై ఇప్పటికి వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వానికి ఇదే పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన పాలనపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని సీఎం జగన్ రేపు జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం ద్వారా సీఎం జగన్ రెండేళ్ల పాలనలోని అంశాలను ప్రజలకు నివేదించనున్నారు.

Exit mobile version