Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Cm Jagan Mohan Reddy Meeting On Vizag Global Investors Mou

CM Jagan: గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ ఒప్పందాల అమలుపై సీఎం జగన్ సమావేశం.. అధికారులకి కీలక ఆదేశాలు

Published Date :June 5, 2023 , 4:57 pm
By NTV WebDesk
CM Jagan: గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ ఒప్పందాల అమలుపై సీఎం జగన్ సమావేశం.. అధికారులకి కీలక ఆదేశాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Jagan Mohan Reddy Meeting On Vizag Global Investors MOU: విశాఖపట్టణంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. శాఖల వారీగా కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రస్తుతం వాటి పరిస్థితులపై సీఎం సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, రంగాలకు విశాఖ హబ్‌ కావాలని సీఎం అన్నారు. దీనికోసం ప్రత్యేక శద్ధ తీసుకోవాలని, దీనివల్ల విశాఖనగరం ఖ్యాతి పెరుగుతుందని, ఐటీకి చిరునామాగా మారుతుందని చెప్పారు. ప్రముఖ సంస్థలతో సంప్రదింపులు నిరంతరం కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.

Adipurush: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్..

పారిశ్రామిక రంగ ప్రగతిలో MSMEలది కీలక పాత్ర అని, ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కూడా ఈ రంగంలోనే ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు. ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం మార్గదర్శకంగా వ్యవహరించాలన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న ఉత్పత్తులు ఏంటి? వాటి ఉత్పత్తిని సాధించడానికి MSMEలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం? ఉత్పత్తి అయిన వస్తువులకు అంతర్జాతీయంగా ప్రముఖ బహుళజాతి సంస్థలతో అనుసంధానం? ఈ మూడు అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. MSMEలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందేలా చూడాలన్నారు. దీనిపై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. పరిశ్రమల శాఖలో MSMEలకోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, ఈ విభాగానికి ఒక కార్యదర్శిని కూడా నియమించాలని సూచించారు. రాష్ట్రం నుంచి బహుళ ఉత్పత్తులు, బహుళ దేశాలకు ఎగుమతులు లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. మరోవైపు నైపుణ్యాలను పెంచడంపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.. ప్రస్తుతం ఉన్న డిగ్రీలకు తోడు అదనంగా ప్రత్యేక నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు.

S** Harassment:‘మేడం మీ ఫిగర్ సూపర్’ అన్నా లైంగిక వేధింపే.. బీ కేర్ ఫుల్..

ఈ నేపథ్యంలోనే.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగేళ్లలో వృద్ధిని అధికారులు సీఎంకి వివరించారు. స్థిరధరల సూచీ ప్రకారం.. 2019లో రాష్ట్రం ఏపీ జీడీపీ వృద్ధి 5.36శాతం అని, ఇది దేశ సగటు 6.5శాతం కన్నా తక్కువ అని తెలిపారు. గడచిన నాలుగేళ్లలో మంచి ప్రగతి ఉందన్నారు. 2021-22లో రాష్ట్ర జీఎస్‌డీపీ గ్రోత్‌ రేట్‌ 11.43శాతానికి పెరిగిందని.. ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా నంబర్‌ ఒన్‌ స్థానంలో నిలుస్తున్నామని సీఎంకి అధికారులు వెల్లడించారు. 2022-23లో జీడీఎస్‌డీపీలో గ్రోత్‌ రేట్‌ 16.22 శాతంగా ఉందని పేర్కొన్నారు. జీడీఎస్‌డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం దాదాపు రూ.13లక్షల కోట్ల వాటా కలిగి ఉందని, పారిశ్రామికరంగం వాటా 21శాతం నుంచి 23శాతానికి పెరిగిందని చెప్పారు. 2022 జనవరి – డిసెంబరు మధ్యకాలంలో రూ.45,217 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 2022-23లో రూ.1.6లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యాయన్నారు. 2021-22లో ఎగుమతుల విలువ 1.43 లక్షల కోట్లు కాగా.. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అది రూ. రూ.1.6లక్షల కోట్లు పెరిగిందని చెప్పుకొచ్చారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సార్లు ఎస్‌ఐపీబీ సమావేశాలు నిర్వహించి, 59 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామన్నారు. వీటి ద్వారా రూ. 3,39,959 కోట్ల పెట్టుబడులు, 2,34,378 మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు. 2016 నుంచి 2018 వరకూ గత ప్రభుత్వం భాగస్వామ్య సదస్సుల ద్వారా 1739 ఎంఓయూలను కుదుర్చుకుంటే రూ. 18,87,058 పెట్టుబడులు వస్తాయని చెప్పారని.. కానీ ఇందులో 10శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదని తెలిపారు. విశాఖపట్నంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ ద్వారా 387 ఒప్పందాలు కుదుర్చుకున్నామని అన్నారు.. ఇందులో పరిశ్రమలు వాణిజ్య శాఖ తరఫున 100 ఒప్పందాలు కుదిరాయని, ఇందులో 13 ఒప్పందాలు ఇప్పటికే వాస్తవ రూపం దాల్చాయని, రూ.2,739 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 6,858 మందికి ఉద్యోగాలు లభించాయని వివరించారు. రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు పనులు మొదలుపెట్టనున్నాయన్నారు. జనవరి 2024లోపు 38 కంపెనీలకు పనులు ప్రారంభమవుతాయని, మార్చి 2024లోపు మరో 30 కంపెనీలు పనులు పూర్తిచేసుకుని ఉత్పత్తిని ప్రారంభిస్తాయనని వెల్లడించారు. దీంతో.. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ ద్వారా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెలన్నీ ఫిబ్రవరి 2024 నాటికి పనులు ప్రారంభించేలా చూడాలని సీఎం ఆదేశించారు.

Minister KTR : హైదరాబాద్ ఇంట్నేషనల్ సిటీ

ఇదే సమయంలో.. విశాఖ సదస్సు ద్వారా 25 విద్యుత్‌ ప్రాజెక్టులకోసం ఒప్పందాలు కుదుర్చుకున్నామని అధికారులు చెప్పారు. ఇందులో 8 ప్రాజెక్టులు ఎస్‌ఐపీబీ ఆమోదం పంపించామని, మరో 4 ప్రాజెక్టుల్లో పనులు ప్రారంభం కానున్నాయని అన్నారు. మరో 8 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయన్నారు. విశాఖ సదస్సు ద్వారా కాకుండా, అంతకుముందే రాష్ట్ర ప్రభుత్వంతో 20 విద్యుత్‌ ప్రాజెక్టులకోసం ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, అందులో 6 ప్రాజెక్టుల్లో పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని తెలిపారు. 11 డీపీఆర్‌ పూర్తిచేసుకున్నాయని వెల్లడించారు. మొత్తం వీటిద్వారా 8.85లక్షల కోట్లు పెట్టిబడులు వస్తుండగా, 1,29,650 మందికి ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు. అనంతరం.. ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందాలపైనా సీఎంకు వివరాలు అందించారు. ఈ రంగాల్లో 88 ఒప్పందాలు చేసుకోగా, వీటి విలువ రూ.44,963 కోట్లని అధికారులు తెలిపారు. అందులో 85శాతం కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించడమో, లేదా ఉత్పత్తికి సిద్ధం కావడమో జరిగిందని అధికారులు వెల్లడించారు. దాదాపుగా రూ.38,573 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయని తెలిపారు.

ఇవికాక ఫుడ్‌ ప్రాససింగ్‌, పశుసంవర్థక శాఖ, టూరిజం రంగాల్లో ఒప్పందాలపైనా సీఎం సమీక్షించారు. ఫుడ్‌ ప్రాససింగ్‌ రంగంలో పెట్టుబడి ప్రతిపాదనలను వీలైనంత త్వరగా కార్యరూపంలో తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. టమెటా, ఉల్లి లాంటి.. డిమాండులో తీవ్ర వ్యత్యాసం తరచుగా వచ్చే పంటల విషయంలో ఈ ప్రాససింగ్‌ యూనిట్లనే నెలకొల్పే పనులను వేగవంతం చేయాలన్నారు. దీనివల్ల రైతులకు తోడ్పాటు ఇచ్చినట్టువుతుందన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP IT Companies
  • CM Jagan Meeting
  • CM Jagan Mohan Reddy
  • Food Processing
  • Vizag Global Investors

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions