YS Jagan: బొత్స కుమారుడి వివాహంలో సీఎం జగన్ దంపతులు

ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స కుమారుడి వివాహం హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ మేరకు సీఎం జగన్ దంపతులు వరుడు డాక్టర్ లక్ష్మీనారాయణ్ సందీప్, వధువు పూజితలను ఆశీర్వదించారు. అటు ఈ వివాహానికి టీడీపీ నేత నంద‌మూరి బాల‌కృష్ణ కూడా వ‌చ్చారు. ఆయ‌న‌ను మంత్రి బొత్స కుటుంబ స‌భ్యులు సాద‌రంగా ఆహ్వానించారు.

మ‌రోవైపు ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు తెలంగాణ‌ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. కేటీఆర్, శ్రీధర్ బాబు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. అంతేకాదు.. మంత్రి కేటీఆర్‌తో ఫోటోలు దిగేందుకు వైసీపీ నేతలు, పెళ్లికి హాజరైన పలువురు అతిథులు పోటీప‌డ్డారు.