Cm Jagan Decision: పాముకాటుకి గురైన విద్యార్ధి ఫ్యామిలీకి సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరం జిల్లా కురుపాంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులంలో విద్యార్ధులు పాముకాటుకు గురైన ఘటన పై ముఖ్యమంత్రికి వివరించారు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందడం, మరో ఇద్దరు విద్యార్ధులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వివరించారు మంత్రులు.
విద్యార్థి మృతిపై స్పందించిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక సాయం ప్రకటించారు. మృతి చెందిన విద్యార్థి మంతిన రంజిత్ కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంత్రుల ద్వారా ఈరోజు విద్యార్ధి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి. దీంతో విద్యార్ధి కుటుంబానికి ఊరట లభించనుంది. ఈఘటనపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
మహాత్మాగాంధీ జ్యోతీబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి పాముకాటుతో ఓ విద్యార్థి మృతి చెందిన సంగతి తెలిసిందే. మరో ఇద్దరు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నారు. భోజనం అనంతరం విద్యార్థులు నిద్రిస్తున్న ఓ గదిలోకి అర్ధరాత్రి సమయంలో పాము ప్రవేశించింది. కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన మంతిని రంజిత్, వంగపండు నవీన్, ఈదుబిల్లి వంశీలను కాటువేసింది. వారిని ప్రాథమిక వైద్యం అనంతరం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి విజయనగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ రంజిత్ మృతిచెందాడు. నవీన్, వంశీలకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పరామర్శించారు. రంజిత్ మరణంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు