Nadendla Manohar: విశాఖ పర్యటనలో సీఎం జగన్‌పై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మరోసారి విమర్శలు చేశారు. ప్రజలు వైసీపీపై తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జనసేనకు కాండక్ట్ సర్టిఫికెట్ ముఖ్యమంత్రి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకు తమ పార్టీని రౌడీసేన అంటున్నారని.. ముఖ్యమంత్రి స్థాయి తగ్గించుకుని వ్యాఖ్యలు చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. సీఎం జగన్‌లో రెండు ముఖాలు ఉన్నాయని.. బయటకు కనిపించేది ఒక్కటైతే.. తెరవెనుక మరొకటి ఉందని ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పరదాలు లేకుండా సొంత నియోజకవర్గంలో కూడా సీఎం జగన్ తిరగలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
Read Also: Manjula Ghattamaneni: కృష్ణ పెళ్ళి రోజు సందర్భంగా మంజుల ఎమోషనల్ పోస్ట్!
సీఎం జగన్ పాల్గొన్న నర్సాపురం సభలో మహిళ చున్నీలు తీయించడం వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. నల్ల చున్నీలు వేసుకున్న వాళ్ళను అడ్డుకోవడం పోలీసులు తప్పు అని.. ఈ ఘటనకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలన్నారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టామని.. ప్రణాళికబద్ధంగా పటిష్టత కోసం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచనలు చేశారని తెలిపారు. విజయనగరం జిల్లాలో జరుగుతున్న దోపిడీలపై చర్చిస్తామని.. క్షేత్ర స్థాయిలో పార్టీ సమీక్ష ఉంటుందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
Read Also: Marri Shashidhar Reddy: వారు డబ్బులు తీసుకోవడం చూడలేదు …కానీ వ్యవహారం చూస్తే