CM Jagan : గొప్ప వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం
క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ జగనన్న తోడు పథకం కింద వడ్డీలేని రుణాలను జమచేశారు. ఈ నేపథ్యంలో లబ్దిదారుల ఖాతాల్లో నగదును సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజుకు రూ.10ల వడ్డీకూడా చెల్లించాల్సిన పరిస్థితులు చిరువ్యాపారులకు ఉండేవని, ఇవాళ రూ.510.46 కోట్ల రుణాలు ఇవ్వడమే కాకుండా, రూ.16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌గా ఇస్తున్నామన్నారు. మొత్తంగా ఇవాళ రూ.526.62 కోట్లను ఇస్తున్నామని, గొప్ప వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. తీసుకున్న రుణాలు తిరిగి కడితే.. బ్యాంకులు ఖచ్చితంగా రుణాలు ఇస్తాయని, ఈ పథకంలో లబ్ధిదారులకు ప్రభుత్వపరంగా ఇతర పథకాలు కూడా వర్తిస్తున్నాయన్నారు. వీటితో వీరి జీవితాల్లో మార్పులు రావాలని మనసారా కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.
చేతివృత్తుల మీద, హస్తకళలమీద బ్రతుకుతున్నవారికి కూడా జగనన్నతోడు వర్తిస్తోందని, ఎవరికైనా రాకపోయినా కంగారుపడాల్సిన అవసరంలేదని, ఎలా ఇవ్వాలని ఆలోచించే ప్రభుత్వం కానీ.. ఎలా ఇవ్వకూడదు అంటూ ఎగ్గొట్టే ప్రభుత్వం కాదిది ఆయన అన్నారు. వాలంటీర్లను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని, లేదా వెబ్సైట్లో కూడా చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. చిరు వ్యాపారులకు స్మార్ట్ కార్డులు కూడా ఇవ్వటం జరిగిందని, గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ.. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుందన ఆయన వెల్లడించారు.
Also Read
- Trisha Visits Tirumala: తమిళనాడు ఫలితాల ముందు తిరుమలలో హీరోయిన్ త్రిషా దర్శనం.. టీవీకే విజయానికి ప్రార్థనలు..?
- PV Sindhu : మ్యాజిక్ డ్రెయిన్స్‌తో పల్లెల్లో సరికొత్త విప్లవం
- Blood Shortage: సమ్మర్లో బ్లడ్ బ్యాంకులకు గడ్డు పరిస్థితి
- AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..
బ్యాంకు ఖాతా తెరిచిన నాటి నుంచి… రుణం మంజూరు అయ్యేంతవరకూ అండగా ఉంటారని, సందేహాలు ఉంటే.. 08912890525కు కాల్చేయొచ్చునని ఆయన తెలిపారు. కోవిడ్ కారణంగా చిరువ్యాపారులు బాగా దెబ్బతిన్నారని సర్వేల్లో చూశామన్నారు. అలాంటి అవస్థలనుంచి మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నిరుపేద కుటుంబాన్ని కాపాడేందుకు మన అందరి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసిందని, డీబీటీ పద్ధతిలో ప్రతి రూపాయికూడా లంచాలకు, వివక్షకు తావులేకుండా నేరుగా రూ. 1.29లక్షల కోట్లు అందించామన్నారు.
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
PSL 2026 Final: తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర.. కెప్టెన్‌గా తొలి పీఎస్ఎల్ ట్రోఫీ అందుకున్న బాబర్ ఆజం
-
Michael: వసూళ్ల వర్షం కురిపిస్తున్న మ్యూజికల్ డ్రామా ‘మైఖేల్’..!
-
West Bengal Results 2026: బెంగాల్లో బీజేపీ దూకుడు.. మ్యాజిక్ ఫిగర్ దాటిన కమలం..
-
IPL 2026 Orange Cap Update: ఆరెంజ్ క్యాప్ రేస్.. విరాట్ కోహ్లీ టాప్-5 నుంచి ఔట్.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ!
-
Sai Sudharsan: 13 ఏళ్ల రికార్డు బద్దలు గొట్టిన సాయి సుదర్శన్.. క్రిస్ గేల్‌ను వెనక్కి నెట్టిన టీమిండియా కుర్రాడు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!