NTV Telugu Site icon

CM Jagan : మన తలరాతను మార్చే శక్తి చదువులకు మాత్రమే ఉంది

Jagan Ongole Meeting

Jagan Ongole Meeting

పెద్ద చదువులు మనిషి చరిత్రను, కుటుంబ చరిత్రను, సామాజిక వర్గ చరిత్రను, రాష్ట్ర చరిత్రను, దేశ చరిత్రను మారుస్తుందని సీఎం జగన్‌ అన్నారు. నేడు సీఎం జగన్‌ 10.85 లక్షల మంది పిల్లలకు విద్యాదీవెన ద్వారా వారి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. చదువులు అన్నవి పిల్లలకు మనం ఇచ్చే ఆస్తులు అన్నారు. చదువును ఎవ్వరూ కూడా దొంగతనం చేయలేని ఆస్తి అని, మన తలరాతను మార్చే శక్తి చదువులకు మాత్రమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని బలంగా నేను నమ్ముతా.. నాన్నగారి హయాంలో పూర్తి ధ్యాసపెట్టారు, పూర్తి ఫీజు రియింబర్స్‌ మెంట్‌ అందింది.. ఆ తర్వాత దీన్ని ఒక్కరు కూడా అమలు చేయలేదు.. చక్కటి మార్పులు చేసి, చదువుల విప్లవాన్ని తీసుకు వచ్చామని ఆయన వెల్లడించారు. తండ్రి ఒక అడుగు వేస్తే, జగన్‌ నాలుగు అడుగులు వేస్తున్నాడు.. చదువుల విప్లవాన్ని దెబ్బతీయడానికి గతంలో ప్రభుత్వాలు చాలా చేశాయి.

పిల్లలను చదివించుకోలేని, ఫీజులు కట్టకోలేకపోతున్న తల్లిదండ్రుల క్షోభను నేను కళ్లారా చూశానన్నారు. ఫీజులకోసం తల్లిదండ్రులు అప్పులు పాలైన ఘటనలు చూశానని, ఇలాంటి కష్టాలు చూసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చూశానన్నారు. ఇలాంటివి పునరావృతం కాకూడదని వంద శాతం పూర్తి ఫీజురియింబర్స్‌మెంట్‌ వరుసగా మూడేళ్లపాటు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ను ప్రతి త్రైమాసికానికి చెల్లిస్తున్నామని, తల్లుల ఖాతాల్లో వేస్తున్నామన్నారు. జనవరి – మార్చి త్రైమాసికానికి సంబంధించి ఇప్పుడు డబ్బులు వేస్తున్నామని, 10.85లక్షల విద్యార్థులకు 9.75 లక్షల తల్లుల ఖాతాల్లోకి రూ.709 కోట్లు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Show comments