Site icon NTV Telugu

CM Jagan : జాగ్రత్త ఇంటికి వెళ్లండి.. మీ అన్నగా సలహా ఇస్తున్నా

Cm Jagan

Cm Jagan

గుంటూరు వేదికగా వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు రెండో రోజు ప్లీనరీ ముగింపు సందర్భంగా సీఎం జగన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుస్తాం.. చంద్రబాబు పార్టీకి డిపాజిట్ కూడా రాదు.. మొరిగినంత మాత్రాన గ్రామ సింహాలు సింహాలు కావు. ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా ఫ్యాన్ గిర్రున తిరిగింది.. సైకిల్ చక్రాలు ఊడిపోయాయి.. చక్రాలు ఊడిన సైకిల్‌ను తండ్రీకొడుకులు తొక్కలేకపోతున్నారు.. అందుకే దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు. ఏ ఎన్నికలు జరిగినా ఫ్యాన్‌ గిర్రున తిరిగింది. సైకిల్‌ చక్రాలు ఊడిపోయాయి. మనకు వెన్నుపోటు ద్వారా అధికారం తీసుకోవాడం రాదు. కౌర సైన్యాన్ని ఓడించడంలో కార్యకర్తలదే అర్జునుడి పాత్ర. కుప్పం మున్సిపాల్టీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు క్లీన్‌ స్వీప్‌ చేశాం. రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని అంటున్నారు. చంద్రబాబు హయాంలో ఏపీ అమెరికా అయ్యిందా..? తెలుగుదేశం పార్టీ, ఎల్లోమీడియా చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి సోషల్‌ మీడియా తిప్పికొట్టాలి. గ్రామాల్లో కూడా సోషల్‌ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేయాలి. ప్రజల్లోకి వెళ్లి మన ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించి మద్దతుగా నిలువాలని దీవెనలు తీసుకోవాలి.

ఎన్నికలకు సన్నద్ధం కావాలి. ఇంటింటికి జరిగిన మేలును చెబుతున్నప్పుడు అవి వెంటనే పరిష్కరించేలా.. పార్టీ నాయకత్వంతో కోఆర్డినేట్‌ చేసుకుంటూ.. కార్యకర్తలు, అభిమానులు చొరవ చూపాల్సిందిగా కోరుతున్నాను. 2009లో సంఘర్షణలో మొదలైనప్పటి నుండి మీరు నావెంటే ఉన్నారు. జెండాను భుజానికెత్తుకున్నారు. అన్నగా అప్యాయత చూపించారు. తమ్ముడిగా తోడుగా నిలబడ్డారు. బిడ్డగా దీవించారు. 2019లో పార్టీకి చారిత్రాత్మక విజయం సాధించి పెట్టడంతో పాటు. ఈ తరువాత జరిగి ప్రతి ఎన్నికల్లో కూడా దుష్టచతుష్టయం చెవులు చిల్లులు పడేలా విజయఢంకా మోగించింది అంటే.. దేవుడి దయ.. ప్రజల ఆశీస్సులతో పాటు.. లక్షల మంది కార్యకర్తల అవిశ్రాంత కృషి అని కూడా సగర్వగంగా తెలియజేస్తున్నాను. చాలా మందైతే రేపు బక్రీద్‌ పండుగా ఉన్నాకూడా.. ఆ పండుగను సైతం పక్కనపెట్టకూడా ఆశీర్వదించడానికి వచ్చారు. మీ చెరగని చిరునవ్వులను నా గుండెల్లో పెట్టుకుంటాను. మీ అప్యాయతలే జగన్‌ను ఇంతవాడిని చేశాయ్‌.

రేపొద్దున జగన్‌ మరింతగా ఎదుగుతాడంటే అది కేవలం మీ అండదండలతోనే అని సగర్వగంగా తెలియజేస్తున్నా.. మీ అందరి దీవెనలు.. దేవుడి దయ ప్రజలందరి ఆశీస్సులు.. సదా మనకు. మీ జగనన్నకు ఎప్పుడూ ఉండాలని సవినయపూర్వకంగా కోరుకుంటూ.. ఎంతో దూరం.. ఎంతో అభిమానంతో ప్లీనరీ వచ్చివారందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరింత ఆత్మవిశ్వాసంతో.. సురక్షితంగా మీ ఇళ్లకు మీరు చేరుకోవాలని.. వెళ్లేటప్పుడు నెమ్మదిగా వెళ్లండని మీ అన్నగా మీకు సలహా ఇస్తూ.. కాస్త ఆలస్యమైన పరవాలేదు నెమ్మది వెళ్లండని సలహా ఇస్తూ.. దేవుడి దయ.. ప్రజల ఆశీస్సులు మన పార్టీపైన ఉండాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version