NTV Telugu Site icon

CM Chandrababu: పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష..!

Babu

Babu

CM Chandrababu: పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓడరేవులు, ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధిపై చర్చ జరిగింది. రాష్ట్రంలో ఆహారశుద్ధి, ఆక్వా రంగాల ఆధారిత ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఒక్కో పార్క్ 100 ఎకరాల విస్తీర్ణంలో 100 పార్కులు ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతుంది. విజయవాడ- మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో పూర్తి స్థాయి కార్యకలాపాలు జరగాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి అవకాశాలు, సంపద సృష్టి కేంద్రాలుగా పోర్టుల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.

Read Also: మీకు మతిమరుపు ఉందా.. అయితే ఈ మూలికలను వాడండి..?

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆహారశుద్ధి, ఆక్వా, ఉద్యానవన రంగాలతో పాటు ఖనిజాధారిత పారిశ్రామికాభివృద్ధి పార్కులు ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నాయి.. ప్రస్తుతం ఉన్న పారిశ్రామికాభివృద్ధి పార్కుల్లో ఎన్ని అభివృద్ధి చేశారు.. ఇంకా అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్న వాటిపై పరిశీలన చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఏరియా ఆధారిత ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి అన్నారు. రాష్ట్రంలో పీపీపీ విధానంలో ఇంటిగ్రేటెడ్ ఓడరేవుల అభివృద్ధికి తగిన మాస్టర్ ప్రణాళిక సిద్ధం చేయాలి అని సూచించారు. దేశంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహిస్తోన్న ఉత్తమ పోర్టులపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.