NTV Telugu Site icon

CM Chandrababu: ఏపీలో వర్షాలపై ఆయా శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..

Chandrababu

Chandrababu

CM Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలపై కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిని సీఎంకు కలెక్టర్లు, అధికారులు వివరించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినట్లు జిల్లా అధికారులు తెలిపారు. అలాగే, సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగులు పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన చంద్రబాబు.. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రవాహాలు, నీటి నిర్వహణ చర్యలను సీఎంకు వివరించిన ఇరిగేషన్ అధికారులు.. నేడు కూడా భారీ వర్షాలు ఉంటాయనే హెచ్చరికలతో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచనలు జారీ చేశారు.

Read Also:Top Headlines @9AM : టాప్ న్యూస్‌!

అయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు నెల్లూరు జిల్లాలోని తడ వద్ద 22 కిలో మీటర్ల వేగంతో తీరం దాటింది. ఇది అల్పపీడనంగా మారి బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ చెప్పుకొచ్చింది. కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడరేవుల్లో ఒకటో నెంబరు హెచ్చరికలు వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు.