Site icon NTV Telugu

AP Free Bus Scheme: బస్సులో సీఎం, డిప్యూటీ సీఎం ప్రయాణం.. జీరో టికెట్ ఇచ్చిన చంద్రబాబు

Babu

Babu

AP Free Bus Scheme: అమరావతిలోని ఉండవల్లి సెంటర్‌ నుంచి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌ వరకు సీఎం చంద్రబాబు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ కూడా ఉన్నారు. ఇక, ఈ ప్రయాణం సందర్భంగా సీఎం చంద్రబాబు, మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను వివరించారు. అలాగే, రోడ్లకు ఇరువైపులా నిలబడి ఉన్న ప్రజలకు, మహిళలకు అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణం కొనసాగించారు.

Read Also: Zerodha Kite Backup: డియర్ ట్రేడర్స్.. జీరోధా కొత్త ఫీచర్.. ఇకపై వాట్సాప్‌లో కైట్ బ్యాకప్ సర్వీస్!

ఇక, ఉండవల్లి నుంచి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌ వరకు మహిళలకు జీరో ఫేర్‌ టికెట్లను ఆర్టీసీ సిబ్బంది చేతుల మీదుగా సీఎం చంద్రబాబు అందజేశారు. ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తోంది.. దాని ప్రయోజనాలను ప్రతి మహిళ వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, కాసేపట్లో విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో జెండా ఊపి ‘శ్రీశక్తి’ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.

Exit mobile version