TDP Key Meeting: ఇవాళ ( ఆగస్టు 23న) ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్టీ ముఖ్య నేతలు, పొలిట్‌బ్యూరో సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రధానంగా చర్చ జరగనుంది. త్వరలో టీడీపీ రాష్ట్ర కమిటీ పొలిట్ బ్యూరోలో మార్పులు జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర కమిటీకి ముందు జిల్లా స్థాయి కమిటీలకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. ముగ్గురు సభ్యులతో జిల్లా కమిటీలు వేసే ఛాన్స్ ఉంది.
Read Also: US-India: టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్‌లో నూతన రాయబారి నియామకం
అయితే, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల వైఖరిపై చర్చ జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేలు వరస వివాదాల్లో ఇర్రుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే సీరియస్ అయ్యారు.. ఇవాళ జరిగే సమావేశంలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఒక రకంగా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వనున్నారు అని ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేల వైఖరి రిపీటెడ్ గా ఇలా ఉంటే.. ఇటు ప్రభుత్వం అటు పార్టీకి చెడ్డపేరు తెచ్చే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో కీలక భేటీ నిర్వహించి నేతలకు సీఎం గట్టిగా చెప్పనున్నారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రులకు ఎమ్మెల్యేల బాధ్యత అప్పగించనున్నారు. ఇదే పరిస్థితి ఇలా కొనసాగితే భవిషత్త్ లో ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు అలర్ట్ అయ్యారు.
Read Also: CM Chandrababu: నేడు పెద్దాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన..
ఇక, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకెళుతున్నారు. పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో అయినా ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని.. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ జనంలోకి వెళ్లేలా కీలకపాత్ర పోషించాలని నేటి సమావేశంలో చెప్పే అవకాశం ఉంది. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు కూడా పార్టీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించే ఛాన్స్ ఉంది. జిల్లాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పార్టీ కార్యాలయానికి వెళ్ళేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కూడా ఇవాళ్టి భేటీలో చెప్పనుమనట్టు టాక్. ఎందుకంటే పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తే కార్యకర్తలకి అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుందని సీఎం చంద్రబాబు నమ్ముతున్నారు.
