Site icon NTV Telugu

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం.. కీలక అంశాలపై చర్చ

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet: ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. అమరావతి రాజధాని నిర్మాణంలో ఫేజ్- 2 భూ సేకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, అమరావతి పునః ప్రారంభ పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారు ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారు. దీంతో పాటు సీఆర్డీఏ 46వ ఆథారిటీ సమావేశంలో అమోదించిన పనులకు ఆమోదం తెల‌ప‌నున్నారు. ఇక, ఉండ‌వ‌ల్లి, పెనుమాక‌లోని జ‌రీబు భూముల రైతుల‌కు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేందుకు కేబినెట్ అథారిటీ ఆమోదం తెలపనున్నారు.

Read Also: Bengal Violence: బెంగాల్ లో అల్లర్లు.. సుప్రీంకోర్టులో విచారణ..

ఇక, అమరావతి రాజ‌ధాని నిర్మాణం కోసం నిధులు సేక‌రించేందుకు సీఆర్డీఏకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మంత్రి మండలి ఆమోదం తెల‌ప‌నుంది. అమ‌రావ‌తిలో నిర్మించే హైకోర్టు, అసెంబ్లీ భ‌వ‌నాల టెండ‌ర్లు ద‌క్కించుకున్న సందస్థలకు ఎల్ఓఏ ఇచ్చేందుకు ఆమోదం లభించనుంది. సీఆర్డీఏ నుంచి ఏడీసీకి 473 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. SIPB సమావేశంలో అమోదించిన వాటికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కొత్తగా రూ.30,667 కోట్లు పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు వ‌చ్చే ప్రతిపాద‌న‌ల‌కు ఇప్పటికే అమోదం తెల‌పిన SIPB.. ఇక, ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కేటాయింపులు జరిగేలా మంత్రి మండలి ఆమోదం తెలపనుంది.

Exit mobile version