NTV Telugu Site icon

CM Chandrababu: సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

Babu

Babu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నాం.. ప్రతి ఇంటికి సహాయం అందించాలి అని సూచించారు. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాల వారికి అప్పగించాలి.. ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించాలని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం తరపున అందించాలి.. వరద తగ్గినందును ఆహారం డోర్ టు డోర్ వెళ్లే అవకాశం ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Read Also: Duleep Trophy 2024: దేశవాళీ టోర్నీ ‘దులీప్ ట్రోఫీ’కి రంగం సిద్ధం.. మ్యాచుల షెడ్యూల్ ఇదే..

ఇక, ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదంప, కేజీ చక్కెర అందించాలి అని సీఎం చంద్రబాబు తెలిపారు. మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా అతి తక్కువ ధరకు కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. నష్టాన్ని వివరించి కేంద్ర సాయం కోరుదాం.. ఆహారం, నీరు, బిస్కెట్స్, పాలు, అరటిపండ్లు అన్నీ డోర్ టు డోర్ అందాలి.. అన్ని అంబులెన్స్ లు పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టండి అని ఆయన చెప్పుకొచ్చారు. విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాలి.. శానిటేషన్ పనులు ఒక యుద్దంలా జరగాలి.. ప్రతి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటికి సంబంధించిన వారిని భాగస్వామ్యులను చేయండి.. వైరల్ ఫీవర్లు, దోమల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కరపత్రాల ద్వారా ప్రజలను చైతన్య పరచండి.. ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి.. ఎవరికి ఏం మెడిసిన్ కావాలన్నా అందించడంతో పాటు పంట నష్టంపై అంచనాలు నమోదు చేయండి అని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Daggubati Purandeswari: వరద సహాయ చర్యల్లో కేంద్రం పూర్తి స్థాయి సహకారం అందిస్తోంది..

ఇక, ఈరోజు ఉదయం 2.3 లక్షల అల్పాహారం ప్యాకెట్లు పంపించామని మంత్రులు, అధికారులు తెలిపారు. 4.5 లక్షల మందికి మధ్యాహ్నం, సాయంత్రానికి భోజనం సిద్ధం చేస్తున్నామన్నారు. అలాగే, 2.5 లక్షల పాల ప్యాకెట్లు, 5 లక్షల వాటర్ బాటిళ్లతో పాటు 117 ట్యాంకర్లను పంపించాం.. మరో 6 లక్షల నీళ్ల బాటిళ్లు సిద్ధంగా ఉంచాం.. వాటర్ ప్యాకెట్లు 10 లక్షల తరలించాం.. మరో 6 లక్షలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం 50 ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉండగా.. వాటితో పారిశుధ్యం పనులు మొదలు పెట్టామని తెలిపారు.

Show comments