NTV Telugu Site icon

CM Chandrababu: ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

Cbn

Cbn

CM Chandrababu: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. నిన్నటి నుంచి నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడడం, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎంవో అధికారులకు చంద్రబాబు నాయుడు సూచించారు.

Read Also: Priyanka Chopra: ప్రియాంక చోప్రా భర్తకు ఊహించని ఘటన.. డేంజర్‌లో ఉన్నాడా?

విజయనగరం జిల్లాలో డయేరియా మరణాలపై సీఎం విచారం..
అలాగే, విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియాతో రెండు రోజుల్లో ఐదుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తన కార్యాలయ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిన్న ఒక్కరోజే నలుగురు మరణించారన్న సమాచారం నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బాధితుల పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స, గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను అధికారుల ద్వారా చంద్రబాబు తెలుసుకున్నారు.

Read Also: Viral : మూత్రం పోసి చపాతీలు పిసికిన పనిమనిషి.. సీసీ కెమెరాలో చూసి కంగుతిన్న యజమాని

అన్నమయ్య జిల్లాలో ఆలయ ధ్వంసంపై చర్యలకు ఆదేశం
ఇక, అన్నమయ్య జిల్లా కదిరినాథుని కోటలోని అటవీ ప్రాంతంలో ఆభయాంజనేయస్వామి ఆలయంపై దాడిని సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. దుండగుల దాడిలో అలయానికి నష్టం జరిగింది.. దీనిపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.