NTV Telugu Site icon

CM Chandrababu: జనాభా లెక్కలు పూర్తయ్యాక.. జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేస్తాం..

Chandrababu

Chandrababu

CM Chandrababu: ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఆ మాట త్వరలో నిలబెట్టుకుంటున్నామన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పా.. జిల్లాల వారీగా కేటగీరి విభజన చేయాల్సి ఉంది.. జనగణన తర్వాత మరోసారి జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేసేందుకు రెడీగా ఉన్నాం.. ఏబీసీడీ కేటగిరీ విభజన కోసం 1996లోనే కమిటీని ఏర్పాటు చేశాం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రేషనలైజేషన్‌, కేటగిరీలపై 2000 ఏడాదిలో చట్టం చేశామని ఆయన గుర్తు చేశారు. కానీ, ఆ చట్టాన్ని కోర్టు కొట్టివేసింది. ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనని ఉషా మెహ్రా కమిషన్‌ రిపోర్ట్ ఇచ్చింది.. స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లపై కూడా కమిటీ రీసెర్చ్ చేసింది.. ఎస్సీ వర్గీకరణ సాకారం కావడంలో నా ప్రయాణం కూడా సుదీర్ఘంగా కొనసాగిందన్నారు. మొదట కమిటీ వేసినప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని సీఎం చంద్రబాబు అన్నారు.

Read Also: Disha Salian: “దిశా సాలియన్‌”పై గ్యాంగ్ రేప్.. “ఆదిత్య ఠాక్రే”పై విచారణ కోరుతూ తండ్రి పిటిషన్..

అయితే, సామాజిక న్యాయం కోసం పరితపించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఇళ్లు కేటాయించిన మొదటి వ్యక్తి ఆయన.. ఎస్సీల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతుండటం చాలా బాధాకరం.. అంటరానితనం నిషేధానికి జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ను నేనే వేశాను.. కుల వివక్షను రూపుమాపడానికి ఎన్నో జీవోలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకమైన సెల్‌ ఏర్పాటు చేశాం.. హోటళ్లు, మంచినీటి బావుల దగ్గర వివక్ష లేకుండా చర్యలు తీసుకున్నాం.. ప్రజల్లో ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.