Site icon NTV Telugu

CM Chandrababu: నేడు మంత్రులు, HoDలు, సెక్రెటరీలతో సీఎం చంద్రబాబు భేటీ

Cbn

Cbn

CM Chandrababu: మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రటరీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ( జనవరి 12న) కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక, ఈ కార్యక్రమానికి జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సచివాలయంలోని ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం జరగనుంది. జీఎస్డీపీ, 2047 విజన్‌లోని 10 సూత్రాలపై సంబంధిత అధికారులు సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆదాయ ఆర్జన, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ విధానంలో ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. పెట్టుబడులు, ఫైల్స్ పరిష్కారం, ఆన్‌లైన్ సేవలు, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.

Read Also: Virat Kohli: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులన్నీ అమ్మకే ఇస్తా.. విరాట్ భావోద్వేగం..!

ఇక, రెవెన్యూ శాఖలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, సర్వే, ఫిర్యాదుల పరిష్కారం, రిజిస్ట్రేషన్ సేవలు, బ్లాక్ చైన్ విధానంతో ప్రజల ఆస్తులకు రక్షణ వంటి వాటిపై అధికారులు, మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే, ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వీబీ-జీ-రామ్ జీ పైనా మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. 2026- 27 బడ్జెట్ కు సంబంధించిన కేటాయింపులపై కూడా సమీక్షించనున్నారు. సమావేశం తర్వాత సాయంత్రం సంక్రాంతి పండుగకు తన స్వగ్రామం నారావారిపల్లెకు సీఎం వెళ్లనున్నారు.

Exit mobile version