Site icon NTV Telugu

CM Chandrababu Warning: ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్

Babu

Babu

CM Chandrababu Warning: కడపలో నిర్వహించిన మహానాడు బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేశాం.. ఎస్సీలకు సామాజిక న్యాయం చేసింది.. ఇక, టీడీపీకి వెన్నెముక బీసీలు.. బీసీలకు నేను సామాజికంగా ఆర్థికంగా పెద్దపీట వేస్తాను అన్నారు. రూ. 47,756 కోట్లు కేటాయించాం.. ఎస్సీ, ఎస్టీలకు రుక్టాప్ సోలార్ ఏర్పాటుకు ఉచితంగా డబ్బులు ఇస్తాం.. బీసీలకు మూడు కిలోవాట్ల వరకు 98,000 సబ్సిడీ ఇస్తాం అని హామీ ఇచ్చారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మారపణ దినోత్సవాన్ని అధికారికంగా చేపడతాం అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది టీడీపీ.. కూటమి ప్రభుత్వం రాకుండా ఉండి ఉంటే మీ భూములు గోవిందా అయ్యేవి.. ఇక, రాబోయే మహానాడు నాటికి భూ సమస్యలు లేకుండా చూస్తానని చంద్రబాబు అన్నారు

Read Also: Mamata Banerjee: ప్రధాని మోడీ విమర్శలపై మమత సవాల్.. టీవీ డిబేట్‌కు రావాలని పిలుపు

ఇక, టెర్రరిస్టులు సమాజానికి ప్రమాదకరం.. ఆపరేషన్ సింధూర్ పేరుతో 10 నిమిషాల్లో టెర్రరిస్టుల స్థావరాలను మన సైన్యం ధ్వంసం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మనదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆర్థిక ఉగ్రవాదులతో నష్టం జరుగుతుంది.. ఆర్థిక ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసే బాధ్యత నాది అన్నారు. రాజకీయ ముసుగులో ల్యాండ్, శాండ్, మైన్ దోచేశారు.. జే బ్రాండ్ తో నాసిరకం మద్యం అమ్మకాలు జరిపారు.. అలాగే, డ్రగ్స్, గంజాయితో యువత నిర్వీర్యమైపోయింది.. ఎవరైనా సరే గంజాయి, డ్రగ్స్ అమ్మితే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మా ఆడబిడ్డల జోలికి వస్తే ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఇక, పోలవరం రాష్ట్రానికే ఒక వరం.. కేంద్రానికి చెప్పి పోలవరాన్ని ఒక గాడిన పెట్టాం.. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం.. గత పాలనలో మూడు ముక్కలు ఆట ఆడి రాజధాని లేకుండా చేశారు అని సీఎం చంద్రబాబు ఆరోపించారు.

Exit mobile version