NTV Telugu Site icon

CM Chandrababu: వచ్చే 3 నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి..

Chandrababu

Chandrababu

CM Chandrababu: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ మీటింగ్ లో 21 అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. వచ్చే మూడు నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు కీలక బాద్యత తీసుకుని ప్రచారం నిర్వహించాలన్నారు. ఇక, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభంలోనే తల్లికి వందనం.. ఏప్రిల్ లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని చెప్పుకొచ్చారు. దీంతో పాటు అన్నదాత సుఖీభవకు సంబంధించిన విధి విధానాలు.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఇస్తారు అనే అంశంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్‌లో మోగనున్న పెళ్లి భాజా..

అలాగే, విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చొరవ తో క్యాబినెట్ లో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నాణ్యమైన పోషకాలు కలిగిన సన్న బియ్యం ( ఫైన్ రైస్) తో మధ్యాహ్న భోజన పథకం అమలు చెయ్యాలని పేర్కొన్నారు. దీంతో పాటు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై కూడా మంత్రి వర్గంలో ఆసక్తికర చర్చ జరిగింది. మెనూలో తీసుకొచ్చిన మార్పుల గురించి క్యాబినెట్ లో మంత్రి లోకేశ్ వివరించారు. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్ట పడి తినే విధంగా మెనూలో మార్పులు చేసినట్లు కేబినెట్ లో తీర్మానించారు.

Read Also: Upasana: పిల్లల్ని కనే విషయంలో ఆధునికతను అనుసరించండి : ఉపాసన

ఇక, నాణ్యమైన పోషకాలు కలిగిన సన్న బియ్యం ( ఫైన్ రైస్ ) అందిస్తే మరింత క్వాలిటీతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని క్యాబినెట్ ముందు ప్రస్తావించారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ పథకానికి అవసరమైన నాణ్యమైన పోషకాలు కలిగిన సన్న బియ్యం పౌరసరఫరాల శాఖ దగ్గర అందుబాటులో ఉంటుందని మంత్రులకు తెలిపిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ సహకారం కావాలని కోరిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మంత్రి లోకేష్ ప్రతిపాదనను బలపరచి అంగీకరించిన ఇతర మంత్రులు. అలాగే, నారా లోకేష్ ప్రతిపాదనకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.