Site icon NTV Telugu

CM Chandrababu: దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Cbn

Cbn

CM Chandrababu: దేవాదాయ శాఖలో 137 ఉద్యోగాల భర్తీకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. డిప్యూటీ కమిషనర్ సహా గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఈవో పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలని పేర్కొన్నారు. ఇక, మరో 200 వైదిక సిబ్బంది కొలువుల నియామకాలకు సైతం అంగీకారం లభించింది. కొత్తగా 16 ఆలయాల్లో నిత్యాన్నదాన పథకం అమలు చేస్తున్నారు. దీంతో 23 ప్రధాన ఆలయాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయండి అని సీఎం సూచించారు.

Read Also: Obulapuram Mining Case: ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు..

అయితే, ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయాల అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలి అని సూచించారు. దేవాలయ భూముల్లో శాఖాహార హోటళ్లకు మాత్రమే అనుమతి ఇవ్వాలని తెలిపారు. దేవాదాయ శాఖపై సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version