బాపట్ల జిల్లా అద్దంకి సిఐ రోశయ్యకు సంబంధించిన రాసలీల ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో చీరాల సీఐగా పనిచేసిన కాలంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, సీఐ ప్రవర్తనతో ఓవ్యక్తి ఉరివేసుకుని చనిపోతున్నట్లు చీరాలలో సెల్పీ వీడియో తీసి ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడని.. అలాగే వివిధ కారణాలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే మహిళల్ని లోబర్చుకుని వేధింపులకు గురి చేస్తున్నారంటూ సీఐపై ఆరోపణలు చేస్తూ కొంతమంది నెట్టింట్లో పెట్టిన ఆడియో క్లిప్‌లు ఇప్పుడు పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారాయి. తనతో మాట్లాడకుండా ఫోన్‌ను బ్లాక్ చేస్తే మామూలుగా ఉండదంటూ ఓ మహిళను సీఐ బెదిరిస్తున్న ఆడియో టేపు ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తన ఆడియోలపై వస్తున్న వార్తలపై కానిస్టేబుల్‌తో సెటెరికల్‌గా స్పందించిన సీఐ ఆడియో మరోకటి రిసెంట్ గా బయటకు వచ్చింది. వాళ్ళ దగ్గర ఆడియో లేకపోతే చెప్పు.. నేను ఆ పనిలో ఉన్నప్పుడు చెబుతా వచ్చి వీడియోలు తీసుకోమను. అవి ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి.. నేను మగాణ్ణి అంటూ కానిస్టేబుల్‌తో మాట్లాడిన మరో ఆడియోలు వాట్సాప్ గ్రూప్ లో చక్కర్లు కొడుతున్నాయి. అద్దంకిలో రెస్టారెంట్ నిర్వహణకు సీఐ రోశయ్య తనను బెదిరించి తక్షణమే లక్ష రూపాయలు ఇవ్వాలని డిమండ్ చేస్తున్నారనినిర్వాహకుడు బాలచందర్ ఆరోపిస్తున్నారు. దీంతో పాటు ప్రతీనెలా పదివేల రూపాయలు మామూలు ఇవ్వాలని.. లేకుంటే రెస్టారెంట్ కి వచ్చే కస్టమర్లను సీఐ ఇబ్బంది పెట్టి కొడుతున్నారని రెస్టారెంట్ యాజమాని ఆరోపించాడు.
Read Also: Chennai: చెన్నైలో దంచికొడుతున్న వానలు.. స్కూళ్లకు సెలవు..
అయితే.. ఈ ఆడియోల కలకలంపై అద్దంకి సీఐ రోశయ్య స్పందించారు. వాటిల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన కొట్టిపారేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు, ఆడియో టేపుల బహిర్గతం వెనుక అద్దంకి పట్టణానికి చెందిన రెస్టారెంట్ యాజమాని బాలచందర్ హస్తం ఉందని సీఐ చెబుతున్నారు. అతనిపై మద్యం కేసు బుక్ చేశానన్న కక్షతో ఇలాంటి ఫేక్ ఆడియోలు సృష్టిస్తున్నారని సీఐ రోశయ్య వివరణ ఇచ్చారు.