Christmas Celebrations: తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల్లో చర్చిలు వెలిగిపోతున్నాయి. ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలతో చర్చిలు కిటకిటలాడుతున్నాయి. చిన్నారులు శాంతాక్లాజ్ వేషధారణలతో ఆకట్టుకుంటున్నారు. అర్థరాత్రి నుంచే ప్రార్థనలు ప్రారంభించారు. ఏసుజన్మవృత్తాంతాన్ని తెలిపేలా భారీ సెట్టింగులతో చర్చిలు కళకళలాడుతున్నాయి. ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి.. విశ్వాసులకు ఆశీస్సులు అందజేస్తున్నారు. అటు ఏపీ ఇటు తెలంగాణలో చర్చిల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. విజయవాడ గుణదల మేరీమాత చర్చిలో క్రైస్తవులు భారీ ఎత్తున వచ్చి ప్రార్థనలు చేసి ఒకరినొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
Read also: Formula-Car Race Case: ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ దూకుడు.. కీలక పరిణామాలు..
మెదక్ చర్చిలో కూడా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి, తెల్లవారుజామున ప్రార్థనలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మెదక్ చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. చిన్నారులకు వినోదం పంచేందుకు చర్చి ఆవరణలో రంగులరాట్నం ఏర్పాటు చేశారు. ముప్పై ఏళ్ల క్రితం చిన్న పాకలో ప్రార్ధనలతో మొదలైనది అంచెలంచెలుగా విస్తరించింది. నేడు, ఇది ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా మారింది. ఇది ఒకేసారి 40,000 మందికి పైగా ప్రార్థన చేయడానికి సౌకర్యాలను కలిగి ఉంది.
Read also: Jagtial Tragedy: ఆ నలుగురు సినిమా సీన్ రిపీట్.. ఆస్తి పంచుకుని అంత్యక్రియలకు రాని బంధువులు..
హనుమకొండ జిల్లా కరుణాపురం క్రీస్తు జ్యోతి చర్చి ప్రార్థనలతో మార్మోగింది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చి పరిసరాలను విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా తీర్చిదిద్దారు. ప్రార్థనా మందిరం క్రైస్తవ ఆరాధన, పాటలు మరియు దేవుని పదాల పఠనంతో నిండిపోయింది. వరంగల్ జిల్లాలో క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కాజీపేటలోని పలు ప్రార్థనా మందిరాలు విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా వెలిశాయి. రాత్రి ప్రత్యేక పూజలు భక్తులను అలరించాయి. కాజీపేటలోని ఫాతిమానగర్ చర్చిలో అర్ధరాత్రి జరిగిన క్రిస్మస్ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Read also: Nizamabad Crime: నిజామాబాద్‌లో ఘరానా మోసం.. 18 పౌండ్ల కోసం రూ.2.75 లక్షల ఫ్రాడ్..
మరోవైపు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచంలో మానవాళికి ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏసు ప్రభువు ఆశయాలను గౌరవించేందుకు క్రిస్మస్ సంతోషకరమైన సందర్భమని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.
Warangal Crime: వరంగల్ జిల్లాలో దారుణం.. గర్ల్స్ క్యాంపస్‌లో విద్యార్థిని ఆత్మహత్య..