YS Jagan Bangarupalyam Visit: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. చిత్తూరు జిల్లా పర్యటనపై హైటెన్షన్ నెలకొంది. బంగారుపాళ్యం మ్యాంగో మార్కెట్ యార్డు చిన్నది కావడంతో కేవలం 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు పోలీసులు.. అంతేకాదు, ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి లేదని ఎస్పీ మణికంఠ తెలిపారు. మరోవైపు పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ బెంగుళూరు నుంచి చిత్తూరు జిల్లా పర్యటనకు రాబోతున్నారు వైఎస్ జగన్?. మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో వారిని పరామర్శించేందుకు బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌లో నేరుగా రైతులతో మాట్లాడబోతున్నారు..
Read Also: Haj Yatra 2026: త్వరపడండి.. హజ్ యాత్ర 2026 కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. అప్పటి వరకే ఛాన్స్..!
ఈ పర్యటన కోసం.. ఉదయం 10 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి 11 గంటలకు బంగారుపాళ్యం మండలం కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు వైఎస్ జగన్?. 11.20 గంటలకు బంగారుపాళ్యం మామిడి మార్కెట్ కు చేరుకుంటారు.. 11.20 గంటల నుంచి 12.20 వరకు రైతులతో ముఖాముఖి మాట్లాడుతారు.. మధ్యాహ్నం 12.35 తిరిగి హెలిప్యాడ్ వద్దకు చేరుకుని బెంగుళూరుకు తిరుగు ప్రయాణంకానున్నారు.. మధ్యాహ్నం 2 గంటలకు బెంగుళూరులోని ఆయన నివాసానికి చేరుకోవడంతో జగన్ పర్యటన ముగియనుంది..
Read Also: Astrology: జులై 9, బుధవారం దినఫలాలు
అయితే, వైఎస్ జగన్ పర్యటనతో.. సీఎం సొంత జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. విస్తారంగా సాగుచేసిన మామిడి భారీగా దిగుబడి వచ్చింది. అయితే రైతుకు గిట్టుబాటు ధర రాలేదు. మామిడి గుజ్జు పరిశ్రమల వద్ద రాత్రింబవళ్లు రైతులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. పల్ప్ పరిశ్రమలు వద్ద బారులు తీరుతున్న మామిడి ట్రాక్టర్లు.. రైతుల కష్టాన్ని ఎలుగెత్తి చాటడంతో రాజకీయ పార్టీల మధ్య రచ్చ మొదలైంది. మామిడి రైతులను ఆదుకోవడంలో, గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ వైసిపి రోడ్డు ఎక్కడంతో సమస్య పొలిటికల్ ఇష్యూగా మారింది. జగన్ బంగారుపాళ్యంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్న టెన్షన్ మొదలైంది. ఇప్పటి వరకు జగన్ ఎక్కడి పర్యటించినా.. ఏదో ఒక ఇష్యూ జరగడంతో.. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు కలిగించినా జగన్ రైతులను కలవడం ఖాయమన్నారు వైసీపీ నేతలు. ఆ పార్టీ నేతలకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి నారాయణస్వామి మండిపడ్డారు.
Read Also: Off The Record: చింతలపూడి వైసీపీలో ఆధిపత్య పోరు
ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్‌ను కలవద్దని, ఏ సమస్యలు ప్రస్తావించొద్దని కూటమి నేతలు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. మామిడి రైతుల గురించి జగన్‌కు ఏమి తెలుసని ప్రశ్నిస్తున్నారు మంత్రులు. జగన్ దండయాత్రకు వస్తున్నట్లు వస్తున్నారని విమర్శిస్తున్నారు. మామిడి రైతులకు సపోర్టు ప్రైస్ ఎప్పుడూ ఇవ్వని వైసీపీ పల్ప్ యూనిట్ల అండతో నాటకాలు ఆడుతోందని మండిపడుతున్నారు. జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చిన పోలీసులు…అనేక ఆంక్షలు విధించారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ వద్దకు 500మందికి, హెలిప్యాడ్ వద్దకు 30 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని ఎస్పీ మణికంఠ స్పష్టం చేశారు. ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలు చేయకూడదన్న నిబంధన పెట్టారు. జన సమీకరణ చేసి బహిరంగ సభ లాగా మార్చాలని చూస్తున్నారని…ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోయించి ర్యాలీలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోందన్నారు. జనాలను తరలించడానికి ప్రయత్నిస్తే…రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. గతంలో సత్యసాయి, ప్రకాశం, గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. జగన్ పర్యటనలో జరగరానిది జరిగితే…వ్యవహారం పోలీసులపైకే వెళ్తుంది. దీంతో పోలీసులు బంగారుపాళ్యం పర్యటనను సీరియస్‌గా తీసుకున్నారు.
