Road Accident: రోడ్డుప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం మదనపల్లి-రాయచోటి ప్రధాన రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మృతులు పెద్దమండ్యం మండలం కలిచర్లకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మదనపల్లి నుంచి స్వగ్రామం కలిచెర్లకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
Andhra Pradesh: ప్రతి ఉమ్మడి జిల్లాలో బయోడైవర్సిటీ పార్క్
Also Read
- MLA Jagan Controversy: మరో వివాదంలో ఎమ్మెల్యే జగన్.. చిత్తూరులో హైటెన్షన్ రాజకీయాలు
- MLA Jagan: కన్నడిగులపై నాకు గౌరవం ఉంది.. ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించండి..
- MLA Jagan: 'బెంగళూరును ఏలుతున్నాం' వ్యాఖ్యలపై దుమారం.. ఎమ్మెల్యే జగన్‌పై కన్నడ సంఘాల ఆగ్రహం
- Nara Bhuvaneswari Emotional: ద్రౌపది నుంచి నేటి రాజకీయాల వరకు.. కుప్పంలో నారా భువనేశ్వరి ఎమోషనల్ స్పీచ్..
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. ఠాణామిట్ట వద్ద వర్షంలో రోడ్డును క్రాస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. లారీ ఢీకొట్టడంతో బైక్‌పై వెళుతున్న నలుగురిలో ముగ్గురు మృతి చెందినట్లు వివరించారు. కాగా ఈ ఘటనలో బైక్ నుజ్జునుజ్జు అయ్యింది. మృతదేహాలు కూడా రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.
తాజావార్తలు
-
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
-
Campbell Thomson: “ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
-
Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్‌రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
-
Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్‌లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!