చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లయిన 5 రోజులకే గుండెపోటుతో నవ వరుడు మృతి చెందాడు. వి.కోట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లి మృతి చెందాడు. మృతుడు.. కర్ణాటక రాష్ట్రం వెంగసంద్రాకు చెందిన కార్తీక్ (28)గా గుర్తించారు. కర్ణాటక రాష్ట్రం వెంగసందరాకు చెందిన కార్తీక్ కు రామకుప్ప మండలం కొల్లుపల్లి చెందిన భవానితో ఐదు రోజుల క్రితం వివాహం జరిగింది.
Read Also: Apple Smart Phones : యాపిల్ స్మార్ట్ ఫోన్లను ఏ దేశంలో ఎక్కువగా వినియోగిస్తున్నారు?
శుక్రవారం ఐదవరోజు అత్తారింటికి వచ్చిన యువకుడు అనారోగ్యంగా ఉందని.. మధ్యాహ్నం పట్టణంలోని ప్రైవేట్ క్లినిక్ కు చికిత్స నిమిత్తం భార్యతో కలిసి వచ్చాడు. అక్కడ చికిత్స పొందుతూ అతను హఠాత్తుగా మృత్యువాత పడ్డాడు. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ఎదుట, కేజీఎఫ్ బస్టాండ్ ముందు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: S Jaishankar: “IC 421 హైజాక్ విమానంలో నా తండ్రి”.. ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్న జైశంకర్..