Site icon NTV Telugu

YS Jagan: వైఎస్‌ జగన్‌ చిత్తూరు జిల్లా పర్యటనకు అనుమతి.. షరతులు వర్తిస్తాయి..!

Ys Jagan

Ys Jagan

YS Jagan: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు అనుమతి ఇచ్చారు పోలీసులు.. 9వ తేదీన బంగారుపాళ్యం పర్యటనకు అనుమతి ఇచ్చారు చిత్తూరు జిల్లా పోలీసులు… అయితే, అనుమతి ఇస్తూనే.. కొన్ని షరతులు పెట్టారు.. 9వ తేదీన బంగారుపాళ్యం పర్యటనకు జగన్‌ వెళ్లనుండగా.. బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డ్ చిన్నది కావడంతో ఐదువందల మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు పోలీసులు.. నిత్యం మామిడి రైతులు మార్కెట్ యార్డుకు వస్తున్న నేపథ్యంలో వారికి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అనుమతి ఇచ్చారు..

Read Also: Revanth Reddy: వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం..!

ఇక, హెలిప్యాడ్‌ వద్ద కేవలం 30 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు పోలీసులు.. ఇప్పటికే హెలిప్యాడ్‌కు కూడా అనుమతి ఇచ్చారు పోలీసులు.. మరోవైపు, ఎలాంటి ర్యాలీలు, రోడ్డు షోలు చేయకూడదని స్పష్టం చేశారు.. ఈ మేరకు వైసీపీ నేతలకు సమాచారం ఇచ్చారు పోలీసులు.. గత అనుభవాలు, ఘటనలు దృష్టిలో పెట్టుకుని అత్యంత జాగ్రత్తలు పాటిస్తున్నారు పోలీసులు.. అయితే, పదివేల మందితో వెళ్లడానికి అనుమతి కోరారు చిత్తూరు జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. కానీ, మార్కెట్‌ చిన్నది కావడం.. మరోవైపు, రైతులు కూడా నిత్యం పెద్ద సంఖ్యలో మార్కెట్‌కు వస్తుండడంతో.. వైఎస్‌ జగన్‌ పర్యటనకు అనుమతి ఇస్తూనే.. షరతులు పెట్టారు పోలీసులు.. అయితే, పోలీసులు నిర్ణయంపై ఇం‌కా వైసీపీ నేతలు స్పందించలేదు..

Exit mobile version