NTV Telugu Site icon

YSRCP: పొత్తులపై వైసీపీ మంత్రులు హాట్ కామెంట్స్..

Peddireddy

Peddireddy

చిత్తూరు జిల్లా పెనుమూరు మండల కేంద్రంలో డీసీసీబి బ్యాంకు ప్రారంభోత్సవంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ రెడ్డప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తులపై హాట్ కామెంట్ చేశారు. మన రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి పై యుద్ధం చేస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా పరోక్షంగా చంద్రబాబుకు మద్దతు ఇస్తుందని.. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలనే షర్మిలమ్మ మాట్లాడుతుందని తెలిపారు. ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా ఉంది.. మిగిలిన మూడు సంవత్సరాల్లో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు మంత్రి తెలిపారు.

Trinamool Congress: లోక్‌సభ బరిలో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్.. టీఎంసీ నుంచి పోటీ..

ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం.. ఏ ముఖ్యమంత్రి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రులు అది చేసే మితి చేశామనే మాటల తప్ప పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు. పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు దాక తీసుకెళ్లారు.. జగన్ కొన్ని లక్షల ఇళ్లు కట్టించామని అన్నారు.
రానున్న ఎన్నికల్లో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మిని అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు.

PM Modi: కుటుంబం లేదని అంటున్నారు.. కానీ, దేశంలోని 140 కోట్ల మంది ‘మోడీ కా పరివార్’’..

మరోవైపు.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ, మత పిచ్చితో బీజేపీ, కుల పిచ్చితో జనసేన, కుట్రతో కాంగ్రెస్ చంద్రబాబుతో జతకట్టాయని దుయ్యబట్టారు. రేపు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బీజేపీ పవన్ లను అడగాల్సిందేనని ఆరోపించారు. గత ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన అందరూ జగన్ వల్లే గెలిచారు.. ఈ ఎన్నికల్లో సుమారు వంద సీట్ల గెలుపు భాద్యతలను పెద్దిరెడ్డికి జగన్ అప్పజెప్పారని తెలిపారు. పెద్దిరెడ్డి బలపరిచిన చిత్తూరు శాసన సభ అభ్యర్థి విజయానందరెడ్డి, ఎంపీ రెడ్డప్పను భారీ మెజారిటీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.