NTV Telugu Site icon

YS Jagan Tirumala Visit: వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన.. ఎన్డీఏ కూటమి నేతల కీలక నిర్ణయం..

Arani Srinivasulu

Arani Srinivasulu

YS Jagan Tirumala Visit: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగిన వేళ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన ఉత్కంఠగా మారింది.. కూటమి పార్టీలతో పాటు హిందూ సంఘాలు జగన్‌ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించడంతో.. ఏం జరగబోతోంది? అనేది ఆసక్తికరంగా మారింది.. అయితే, ఈ సమయంలో.. తిరుపతిలో సమావేశమైన ఎన్డీఏ కూమటి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్, పసుపులేటి హరిప్రసాద్, అజయ్ కుమార్ తదితర నేతలు హాజరు అయ్యారు. ఇక, ఈ సమావేశంలో.. మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోరాదని నిర్ణయం తీసుకున్నారు.. తిరుమలకు జగన్ వెళ్లే దారిలో ఎన్డీఏ కూటమి నేతలు శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించారు.. శ్రీవారి లడ్డూ ప్రసాదాల కల్తీకి జగన్ కారణమని ఎన్డీఎ కూటమి నిరసనకు ప్లాన్ చేసింది.. రాజకీయ బలప్రదర్శనకు వైసీపీ దిగితే దీటుగా సమాధానం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.

Read Also: iPhone 16: పది నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ.. ఎక్కడ ఆర్డర్ చేయాలంటే.?

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ.. అక్టోబర్ 4వ తేదీ శ్రీవారికి సీఎం చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.. అక్టోబర్ 2వ తేదీ పవన్ కల్యాణ్‌ తిరుపతికి వస్తున్నారు.. ప్రాయచ్చిత్త దీక్షను పవన్‌ కల్యాణ్‌ తిరుమలలో ముగిస్తారు అని తెలిపారు.. 2వ తేదీన సాయంత్రం 5 గంటలకు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు పవన్ బయలుదేరుతారు.. 3వ తేదీన ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు.. మూడో తేదీ సాయంత్రం తిరుపతిలో వారాహిసభలో పవన్ కల్యాణ్‌ పాల్గొంటారని వెల్లడించారు.. వారాహి సభ విజయవంతం చేస్తాం అన్నారు.. మరోవైపు.. శ్రీవారిని దర్శించుకునే అర్హత వైఎస్‌ జగన్ కు లేదని మండిపడ్డారు.. జగన్ ఐదేళ్లలో తన సతీమణితో కలిసి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించ లేదన్న ఆయన.. ఇందిరా గాంధీ, అబ్దుల్ కలామ్ లాంటి వాళ్లు డిక్లరేషన్ ఇచ్చి.. స్వామివారిని దర్శించుకున్నారు.. కానీ, జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా స్వామిని దర్శించుకుంటున్నారు అంటూ దుయ్యబట్టారు.. ఇది ఆగమశాస్త్రానికి విరుద్ధం.. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో సంక్షేమం పేరుతో దోచుకున్నారు.. దేవాలయాలను అపవిత్రం చేశారు అని మండిపడ్డారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.