NTV Telugu Site icon

Battula Prabhakar: కొడుకు రిచ్.. తండ్రి మాత్రం నిరుపేద.. బయటపడ్డ బత్తుల ప్రభాకర్ బాగోతం!

Bathulla

Bathulla

Battula Prabhakar: చిత్తరు జిల్లాలోని సోమల పరిధిలో గల ఇరికి పెంట పంచాయతీ పరిధిలో ఉన్న వడ్డిపల్లెకి చెందిన గజ దొంగ బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డిపై కన్న తండ్రి అవేదన వ్యక్తం చేశారు. విచారణలో తన తల్లిదండ్రులు మరణించారని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఇక, కటిక పేదరికంలో జీవితాన్ని ప్రభాకర్ తండ్రి కృష్ణయ్య నెట్టుకొస్తున్నారు. శిథిలమైన ఇంట్లో నివసిస్తూ.. ప్రభుత్వమిచ్చే ఐదు కిలోల బియ్యం. వృద్ధాప్య పింఛన్, బిక్షమెత్తుకుంటూ గజదొంగ బత్తుల ప్రభాకర్ తండ్రి కృష్ణయ్య బతుకుతున్నారు.

Read Also: Maharashtra: సీఎం ఫడ్నవీస్ మీటింగ్‌కి ఏక్‌నాథ్ షిండే మళ్లీ గైర్హాజరు.. ప్రభుత్వంలో విబేధాలు..?

ఈ సందర్భంగా బత్తుల ప్రభాకర్ తండ్రి మాట్లాడుతూ.. నా కొడుకు నన్ను ఎప్పుడో వదిలేశాడని తెలిపారు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, తన దగ్గర కనీసం సెల్‌ఫోన్ కూడా లేదని కృష్ణయ్య తెలిపారు. ఏ ఒక్కరోజు ఒక ముద్ద అన్నం పెట్టలేదు.. రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకు వల్ల నేను చాలా అనుమానం పడుతున్నాను. నా కొడుకు ప్రభాకర్ చచ్చిపొయినా బాధ లేదు అని తెలిపాడు. నేను ఎక్కడ కూడా చెడ్డవాడని అని పిలిపించుకున్నాను.. రోజు గుడి దగ్గర అన్నం పెడితే తిని బతుకుతున్నాను.. 1985లో తిరుపతికి చెందిన సుబ్బమ్మతో పెళ్లింది.. 2000 సంవత్సరంలో కూలి పనులకు గుంటూరు వెళ్ళాను.. చిలకలూరిపేటలో ప్రభాకర్ జన్మించాడని బత్తుల ప్రభాకర్ తండ్రి కృష్ణయ్య చెప్పుకొచ్చారు.